Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిపాదనలకు గడువు నవంబర్ 30
- డిసెంబర్ 13 నుంచి 16 వరకు ఎస్ఎఫ్ఐ 17వ అఖిల భారత మహాసభ
- హైదరాబాద్ వేదికగా మహాసభలు
న్యూఢిల్లీ : భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) 17వ అఖిల భారత మహాసభ డిసెంబర్ 13 నుంచి 16 వరకు హైదరాబాద్‌లో జరగనున్నది. సంఘం అత్యున్నత నిర్ణయాధికార బాడీకి సంబంధించిన ప్రొసీడింగ్‌లలో భాగంగా ఎస్ఎఫ్ఐ సభ్యుల నుంచి సంఘం కార్యక్రమం, రాజ్యాంగానికి సవరణల ప్రతిపాదనలను ఎస్ఎఫ్ఐ సీఈసీ ఆహ్వానించింది. ఈ మేరకు ఆదివారం ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విపి సానూ, మయూక్ బిశ్వాస్‌లు ప్రకటన విడుదల చేశారు. ఎస్ఎఫ్ఐలోని ఏ సభ్యుడైనా సంఘం కార్యక్రమం, రాజ్యాంగంలోని ఏదైనా విభాగం, వాక్యంపై సవరణను ప్రతిపాదించవచ్చని తెలిపారు. ఆ ప్రతిపాదనలు కార్యక్రమం, రాజ్యాంగంలో మార్చవచ్చు, సవరించవచ్చు, తీసివేయవచ్చు, చేర్చవచ్చని పేర్కొన్నారు. ప్రతిపాదిత సవరణలు పేరా సంఖ్య, వాక్యాన్ని ప్రస్తావిస్తూ స్పష్టంగా రాయాలని, ఇప్పటికే ఉన్న వాక్యానికి సవరణల విషయంలో ప్రతిపాదిత వాక్యాన్ని పేరా సంఖ్య, విభాగాన్ని రాయాలని, కొత్త వాక్యం, పేరా ప్రతిపాదిస్తే దానిని ఎక్కడ చేర్చాల్సి ఉంటుందో స్పష్టంగా పేర్కొనాలని తెలిపారు. ప్రతిపాదకులు తమ పేరు, ఎస్ఎఫ్ఐలో ఆయన సభ్యత్వం ఏ కమిటీలో ఉందో పేర్కొనాలి. సవరణల కోసం ప్రతిపాదనలు నవంబర్ 30 వరకు పంపొచ్చనీ, ఆ తరువాత పంపితే వాటిని ఆమోదించమని పేర్కొన్నారు. ప్రతిపాదిత సవరణలన్నీ ఎస్ఎఫ్ఐ సీఈసీకి (శీటళషవరళషవషఏస్త్రఎaఱశ్రీ.షశీఎ) మెయిల్ ద్వారా పంపాలని, అలాగే పోస్టు ద్వారా పంపాలనుకునే వారు, ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి, అధ్యక్షుడు, 36-క్యానింగ్ లైన్, న్యూఢిల్లీ-110001 అడ్రస్‌కు పంపాలని తెలిపారు.