Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజకీయ పక్షపాతాన్ని బయటపెట్టుకున్నారు
- కేరళ గవర్నర్ హెచ్చరికలపై సీపీఐ(ఎం)
తిరువనంతపురం : మంత్రులను వారి పదవుల నుంచి తొలగించే అధికారం ఉపయోగించటం వంటి చర్యల గురించి ఒక ట్వీట్లో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ హెచ్చరించటంపై సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో స్పందించింది. కేరళ గవర్నర్ ఇలాంటి రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రకటనలు చేయకుండా భారత రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని కోరింది. ఈ మేరకు పొలిట్‌బ్యూరో ఒక ప్రకటనను విడుదల చేసింది. ఆరిఫ్ మహ్మద్ ఖాన్ రాజ్యాంగబద్ధమైన పదవికి సరితూగని రీతిలో వ్యవహరిస్తున్నాని పేర్కొన్నది. కేరళ గవర్నర్ అధికారిక ఖాతా నుంచి వచ్చిన ఒక ట్వీట్‌ను ఈ సందర్భంగా ఉటంకించింది.
ఒక్కొక్క మంత్రుల ప్రకటనలు గవర్నర్ కార్యాలయం పరువు తగ్గించేలా ఉంటే చర్యలుంటాయన్న హెచ్చరికలపై అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఇది ఒక మంత్రిని బర్తరఫ్ చేయొచ్చని చెప్పటానికి సమానమని పేర్కొన్నది. ఇలాంటి నియంతృత్వ అధికారాలు రాజ్యాంగం ద్వారా గవర్నర్‌కు ఇవ్వబడలేదని పొలిట్‌బ్యూరో వివరించింది. అలాంటి ప్రకటన చేయటం ద్వారా ఆరిఫ్ ఖాన్ తన రాజకీయ పక్షపాతాన్ని, ఎల్డీఎఫ్ ప్రభుత్వం పట్ల శత్రుత్వాన్ని మాత్రమే బయటపెట్టారని పేర్కొన్నది.