Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : లఖింపూర్ ఖేరీ హింస కేసులో రెగ్యులర్ బెయిల్ కోరుతూ కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా దాఖలు చేసిన పిటిషన్పై రెండు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించిం ది. ఇందుకు రెండు వారాల సమయం ఇచ్చింది. ఆశిష్ మిశ్రాకు రెగ్యులర్ బెయిల్ తిరస్కరిస్తూ జూలై 26న ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు న్యాయమూ ర్తులు జస్టిస్ బిఆర్ గవారు, జస్టిస్ బివి నాగరత్నంతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఆశిష్ మిశ్రా తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదని అన్నారు. బాధితుల తరపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ నేరం ముందస్తు ప్రణాళికతో జరిగిన ట్లు చూపే ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ధర్మా సనం నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.