Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : జనాభా లెక్కల్లో బీసీ కుల గణనకు సంబంధించిన కేసు విచారణ వాయిదా పడింది. బీసీ కుల గణన చేపట్టాలంటూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు ఆర్.కృష్ణయ్య పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ బేలా ఎం త్రివేదితో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారించింది. కృష్ణయ్య తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఈ అంశంపై ఇప్పటికే మరో ధర్మాసనం కేసు విచారణలో ఉందనీ, విచారణ తేదీ పేర్కొనలేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. మరో పిటిషన్‌తో పాటు ప్రస్తుత పిటిషన్‌ను నవంబరు 2న సంబంధిత ధర్మాసనం విచారణ జాబితాలో చేర్చాలంటూ రిజిస్ట్రీని సీజేఐ జస్టిస్ యుయు లలిత్ ఆదేశించారు.