Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులకు ప్రధాని మోడీ పిలుపు
- 600 కిసాన్ సమృద్ధి కేంద్రాలు, 'ఒకే దేశం ఒకే ఎరువు' పథకం ప్రారంభం
- పీఎం కిసాన్ నిధులు విడుదల
న్యూఢిల్లీ : వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు ఐక్యంగా కృషి చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చా రు. సోమవారం నాడిక్కడ ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఐఏఆర్ఐ)లో పీఎం కిసాన్ సమ్మేళన్-2022ను ప్రారంభించారు. అలాగే 600 ప్రధాన మంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలను, ఒక దేశం ఒక ఎరువు పథకాన్ని ప్రారంభించారు. భారత్ యూరియా బ్యాగ్‌ల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీఎం కిసాన్ నిధి 12వ విడత కింద 8.5 కోట్ల మంది రైతులకు రూ.16 వేల కోట్లు విడుదల చేశారు. రైతుల ఖాతాలకు రూ.2 లక్షల కోట్లకు పైగా నగదు బదిలీ చేశామనీ, ఇన్పుట్ కాస్ట్‌ను నిర్వహించడంలో ఇది వారికి సహాయ పడిందని మోడీ అన్నారు. దేశంలో వ్యవసాయాన్ని ఆధునీకరించేందుకు చర్యలు తీసు కుంటున్నట్టు చెప్పారు. ఈ ప్రక్రియలో రైతులకు సహాయ కేంద్రాలుగా కిసాన్ సమృద్ధి కేంద్రాలు పని చేస్తాయన్నారు. దేశం యూరియా ఉత్పత్తిలో స్వయం సమృద్ధి దిశగా పయనిస్తున్నదని అన్నారు. ''యూరియా కొరత సమస్యను పరిష్కరించేందుకు నానో యూరియా రైతులకు సహాయం చేస్తుంది'' అని మోడీ అన్నారు. రైతులకు సహాయం చేయడానికి ఎరువులను ''భారత్'' గా రీ బ్రాండ్ చేయనున్నామని, రవాణా ఖర్చులను నియంత్రించడం వలన ప్రధాన ఎరువుల ధరలు తగ్గుతాయని అని చెప్పారు. వ్యవసాయంలో రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.