Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దుబ్బాక, హుజురాబాద్‌కు కేంద్రం నిధులపై స్పష్టతనిచ్చాం
- తెలంగాణ ద్రోహుల పార్టీగా టీఆర్ఎస్ : బండి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఢిల్లీలోని తమ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఇన్చార్జి తరుణ్‌చుగ్, కేంద్ర మంత్రుల సమక్షంలో బూరనర్సయ్య గౌడ్ బీజేపీలో చేరబోతున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కుమార్ తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని బూరనర్సయ్య గౌడ్ ఇంటికి ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ.. తెలంగాణ ద్రోహుల పార్టీగా టీఆర్ఎస్ మారిందని విమర్శించారు. స్వలాభం కోసం కాకుండా.. రాష్ట్ర భవిష్యత్ కోసమే బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరుతున్నారన్నారు. ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన బూర నర్సయ్య లాంటి నేతలు కేసీఆర్‌ను కలిసే పరిస్థితి లేదన్నారు. బూర నర్సయ్య మాట్లాడుతూ... టీఆర్ఎస్లో అడుగడుగునా అవమానాలు ఎదుర్కొన్నానని చెప్పారు. కేసీఆర్ తనకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
600 పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను ప్రారంభించడం హర్షనీయం : బండి
పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్‌లో భాగంగా సోమవారం నాడు ప్రధాని నరేంద్రమోడీ 600 పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను ప్రారంభించడం హర్షనీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాలోని ప్రతి జిల్లాకు ఒక కిసాన్ సమృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.