Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఎస్ఎఫ్ఐ 17వ అఖిల భారత మహాసభల లోగోను త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ఆవిష్కరించారు. మంగళవారం త్రిపుర రాజధాని అగర్తలాలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ లోగోను మాణిక్ సర్కార్ ఆవిష్కరించారు. ఈ లోగో తయారీకి ఎస్ఎఫ్ఐ ఆన్లైన్లో ఆహ్వానించింది. చాలా లోగోలు అందగా, వాటిలో ఆల్బీ అసిక్ డిజైన్ చేసిన లోగోను ఎస్ఎఫ్ఐ ఆమోదించింది. లోగో ఆవిష్కరణలో ఎస్ఎఫ్ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విపి సాను, మయూక్ బిశ్వాస్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ 17వ అఖిల భారత మహాసభ డిసెంబర్ 13 నుంచి 16 వరకు హైదరాబాద్లో జరగనున్నాయి.