Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 11 మందితో నూతన కార్యదర్శివర్గం
- ముగిసిన సీపీఐ జాతీయ మహాసభ
అమరావతి : భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ప్రధాన కార్యదర్శిగా డి.రాజా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐదురోజులపాటు విజయవాడలో జరిగిన 24వ మహాసభలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. 11 మందితో కార్యదర్శివర్గం, 31 మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీ, 129 మందితో జాతీయ కౌన్సిల్ ఏర్పాటైంది. వీరు కాక 13 మందిని క్యాండిటేట్ సభ్యులుగా నేషనల్ కౌన్సిల్‌కు తీసుకున్నారు. ఆహ్వానితులుగా ఇద్దరు, శాశ్వత ఆహ్వానితులుగా ఒకరితో జాతీయ కౌన్సిల్ ఏర్పాటైంది. 11 మందితో కంట్రోల్ కమిషన్ ఏర్పాటైంది. కొత్తగా ఏర్పాటైన కార్యదర్శివర్గంలో డి.రాజా, కనమ్ రాజేంద్రన్, అతుల్‌కుమార్ అంజన్, అమర్జీత్కౌర్, కె.నారాయణ, డాక్టర్ బి.కె.కాంగో, బినరు విశ్వం, పల్లవ్సేన్గుప్తా, నరేంద్రనాథ్ ఓజా, అజీజ్‌పాషా, రామకృష్ణ పాండా ఉన్నారు. నూతన కమిటీలోకి తెలంగాణా నుంచి చాడా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు, పల్లా వెంకటరెడ్డి, పశ్యపద్మ, టి.శ్రీనివాసరావు, కె.శంకర్, బాలనరసింహ, బి.హేమంతరావు ఉన్నారు. ఏపీ నుంచి ఏడుగురిని తీసుకున్నారు. ఏపీ నుంచి ఎన్నికైన వారిలో కె.రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు, జె.వి.సత్యనారాయణమూర్తి, జి.ఓబులేసు, ఎ.వనజ, టి.మధు, కె.శివారెడ్డి ఉన్నారు.. కంట్రోల్ కమిషన్ సభ్యులుగా రాజేంద్రకుమార్, శత్రుగప్రసాదు సింగ్, డాక్టర్ నారా సింగ్, పి.దుర్గాభవానీ, సత్యం మెకేరీ, రామ్బహేటి, హర్దేవ్సింగ్ ఆర్షి, త్రిచ్చి ఎం సెల్వరాజ్, మోతీలాల్, నిషా సిద్దు, మహ్మద్ యూసుఫ్ సభ్యులుగా ఉన్నారు. ఐదు రోజుల జరిగిన ఈ సహాసభల్లో పలు తీర్మానాలను ఆమోదించారు. ముఖ్యంగా అమరావతి, విశాఖస్టీలు ప్లాంటుతోపాటు, మోడీ ఆర్థికవిధానాలపై పోరాటం, ఉపాధి కల్పన తదితర అంశాలపై చర్చించారు. ముఖ్యంగా పార్టీని బలోపేతం చేసుకోవడంపై మరొక తీర్మానాన్ని, వందేళ్ల వార్షికోత్సవం తదితర అంశాలపైనా చర్చించి ప్రతినిధులు పలు తీర్మానాలు చేశారు. తొలిరోజు సభతో ప్రారంభమైన మహాసభలో రెండోరోజు సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎంఎల్ పార్టీ నాయకులు దీపాంకర్ భట్టాచార్య, ఫార్వార్డ్ బ్లాక్ నాయకులు దేవరాజన్ తదితరులు సౌహార్థ సందేశాలు ఇచ్చారు.