Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేటగిరీల్లో 25 శాతం కోత..
న్యూఢిల్లీ : పీజీ మెడికల్ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్ల కోసం కటాఫ్ మార్కులు తగ్గించేందుకు కేంద్రం ఆమోదం తెలిపిందని జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ప్రకటించింది. అధికారిక నోటీసుల ప్రకారం... అన్ని కేటగిరీల్లో కటాఫ్ మార్కులు 25 శాతం తగ్గాయని తెలిపింది. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కటాఫ్ మార్కుల తగ్గింపు 25 శాతం ఉండగా, జనరల్ కేటగిరీలో వికలాంగ అభ్యర్థులకు 20 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీలలో వికలాంగ అభ్యర్థులకు 15 శాతం కటాఫ్ మార్కుల తగ్గింపు ఉంటుందని పేర్కొంది. గతేడాది అడ్మిషన్ల కోసం నిర్వహించిన పీజీ కౌన్సిలింగ్లో పెద్ద సంఖ్యలో సీట్లు ఖాళీ కావడంతో ఎన్ఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ (ఎంసీసీ) 197 సీట్లను నీట్ యుజి కౌన్సిలింగ్ మొదటి రౌండ్‌కు కలిపిందని, యూజీ కౌన్సిలింగ్ 2022 మొదటి రౌండ్ ప్రారంభానికి ముందు సంబంధిత కాలేజీలు అందించలేదని పేర్కొంది.