Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ తెలంగాణ ఇన్చార్జి తరుణ్ చుగ్
న్యూఢిల్లీ : సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాల అమలులో విఫలమయ్యారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ విమర్శించారు. కుటుంబ పాలన వల్లే రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. మంగళవారం నాడిక్కడ మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ తరుణ్ చుగ్‌ను కలిశారు. ఈ సందర్భంగా తరుణ్ చుగ్ మీడియాతో మాట్లాడుతూ ''తెలంగాణ కేవలం ఒక కుటుంబం కోసం మాత్రమే ఏర్పడింది. ఎనిమిదేండ్లలో కుటుంబ పాలన వల్ల తెలంగాణ వెనకబడింది. ఓబీసీ, డబుల్ బెడ్ రూమ్, దళిత బంధు, ఏ ఒక్క పథకాన్ని తెలంగాణలో సరిగ్గా అమలు చేయలేదు. తెలంగాణ దేనికోసం ఏర్పడిందో ఆ కలను కేసీఆర్ నెరవేర్చలేదు'' అని అన్నారు.