Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ : మేధావి, సామాజిక కార్యకర్త ఉమర్ ఖలీద్‌కి బెయిల్ ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు మంగళవారం తిరస్కరించింది. 2020 సెప్టెంబరు 14నుండి ఖలీద్ జైల్లో వుంటున్నారు. ఈశాన్య ఢిల్లీ అల్లర్ల వెనుక గల విస్తృత కుట్రకు ఖలీద్‌కి సంబంధం వుందని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. ఉమర్ ఖలీద్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్లో సరైన కారణాలు కనిపించలేదని, అం దువల్ల ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చుతున్నామని జస్టిస్ భట్నాగర్ తెలిపారు. అక్రమ కార్యకలాపాల (నిరోధక) చట్టం, ఐపిసిలోని పలు సెక్షన్ల కింద ఖలీద్ అభియో గాలు ఎదుర్కొంటున్నారు. మూడుసార్లు బెయిల్ పిటిషన్ వాయిదా పడిన తర్వాత, 8నెలలు విచారణ జరిగిన తర్వాత మార్చి 23న ఒకసారి బెయిల్ ను తిరస్కరించారు. తనకు బెయిల్‌ను తిరస్కరించడాన్ని ఖలీద్ సవాలు చేశారు.