Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం
న్యూఢిల్లీ : రబీ సీజన్లో ఆరు పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. మంగళవారం నాడిక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ సమావేశం జరిగింది. 2023-24 రబీ పంటలకు మద్దతు ధరను ఆమోదించింది. సమావేశ అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం లో కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ కేంద్ర మంత్రి వర్గ నిర్ణయాలను వెల్లడించారు. ఆవాలకు 104 శాతం, గోధుమలకు 100 శాతం, కేసరి (మసూర్)కి 85 శాతం, శనగలకు 65 శాతం, బార్లీకి 60 శాతం, కుసుమ గింజలకు 50 శాతం ఖర్చుకు మించి రాబడి వస్తుందని తెలిపారు. కేసరి (మసూర్) క్వింటాకు రూ. 500, ఆవాలు క్వింటాకు రూ. 400, కుసుమకు క్వింటాకు రూ.209, గోధుమలు రూ.110, శనగలు రూ.105, బార్లీకు రూ.100 పెంచినట్లు చెప్పారు. గోధుమలు క్వింటాకు రూ.2,125, బార్లీ రూ.1,735, శనగలకు రూ.5,335, కేశరి (మసూర్) రూ.6,000, ఆవాలకు రూ.5,450, కుసుమకు రూ.5,650 ఎంఎస్పి నిర్ణయించినట్లు తెలిపారు.