Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈసీకి టీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ వినతి
న్యూఢిల్లీ : టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారును పోలిన గుర్తులను తొలగించాలని టీఆర్ఎస్ నేత బి. వినోద్ కోరారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ లేఖ రాసింది. అయితే ఆ లేఖపై ఈసీ నుంచి స్పందన రాకపోవడంతో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైన నేపథ్యంలో తాము కలగజేసుకోలేమంటూ హైకోర్టు చెప్పింది. దీంతో మంగళవారం నాడిక్కడ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులనుటీ ఆర్ఎస్ నేత బి.వినోద్ కలిసి వినతి అందజేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కారు గుర్తును పోలిన 8 గుర్తులను ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉంచిన విషయాన్ని ఆయన ఎన్నికల సంఘానికి తెలిపారు. ఈ గుర్తులను స్వతంత్ర అభ్యర్థులకు కేటాయిస్తే తమ పార్టీ అభ్యర్థికి నష్టం జరుగుతుందని ఆయన ఎన్నికల సంఘానికి తెలిపారు. ఈ నేపథ్యంలో కారును పోలిన ఆ 8 గుర్తులను ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని ఆయన ఎన్నికల సంఘాన్ని కోరారు.