Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జర్నలిస్టులు, నిరసనకారులపై దాడులు పెరిగాయి :
ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెర్రస్
న్యూఢిల్లీ : భారత్లో జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలపై దాడులు పెరిగాయని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత మానవ హక్కుల రికార్డుపై ఆయన విమర్శలు చేశారు. ప్రభుత్వ విమర్శకులు, జర్నలిస్టులు, మహిళా రిపోర్టర్లపై దాడులు అధికమయ్యాయని కీలక వ్యాఖ్యలు చేశారు. మానవ హక్కుల కౌన్సిల్ సభ్య దేశంగా భారత్ తన గళాన్ని వినిపించాలన్నా, విశ్వాసాన్ని పొందాలన్నా.. దేశంలో హక్కుల పరిరక్షణ బాధ్యత భారత ప్రభుత్వంపై ఉంటుందన్నారు. తద్వారా అంతర్జాతీయ వేదికపై భారత్ తన గళాన్ని, విశ్వాసాన్ని పొందుతుందని చెప్పారు. మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా బుధవారం ఐఐటీ ముంబయిలో విద్యార్థుల్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. బ్రిటీష్ పాలన నుంచి విముక్తి పొందిన తర్వాత ఈ 75ఏండ్లలో భారత్ సాధించిన విజయాలను ప్రశంసించారు. అలాగే భారత్లో వైవిధ్యం గొప్పగా ఉంటే సరిపోదని, హక్కుల రక్షణ ప్రభుత్వాలు బాధ్యతగా చేపట్టాలన్నారు.