Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ బీజేపీలో చేరారు. ఆయన బుధవారం నాడిక్కడ బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుగ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజరు, ఎంపీ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.