Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టాప్ 10 ఎన్జిఒగా గుర్తింపు
ముంబయి : ప్రముఖ లాభాపేక్ష లేని సేవా సంస్థ సెయింట్ జుడ్ ఇండియా చైల్డ్‌కేర్ సెంటర్స్ (సెయిం ట్ జుడ్స్) దేశంలోనే అగ్రశ్రేణీ 10 బెస్ట్ ఎన్జిఒల్లో ఒక్కటిగా గుర్తింపు పొందిందని ఆ సంస్థ తెలిపింది. ప్రపంచంలోనే గ్రేట్ ప్లేస్ టు వర్క్ విభాగంలో ఈ స్థానం దక్కినట్లు పేర్కొంది. గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇన్స్ట్యూట్ ఇచ్చిన ర్యాంక్‌ల్లో తమకు ఈ గుర్తింపు లభించడం సంతోషంగా ఉందని వెల్లడించింది. తమకు ఈ గుర్తింపు రావడం వరుసగా నాలుగో సారి అని పేర్కొంది. మహిళలు పని చేసే స్థలంలోనూ తమకు ప్రధాన గుర్తింపు లభించినట్లు ఆ సంస్థ వెల్లడించింది.