Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరు నెలల జైలు శిక్ష : ఢిల్లీ మంత్రి
న్యూఢిల్లీ : దీపావళి రోజున ఢిల్లీలో బాణాసంచా కాల్చితే ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.200 జరిమానా విధిస్తామని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రారు బుధవారం హెచ్చరించారు. అలాగే బాణాసంచాను ఉత్పత్తి చేయడం, నిల్వ చేయడం, విక్రయించడం చేస్తే పేలుడు పదార్ధాల చట్టంలోని సెక్షన్ 9బి కింద మూడు ఏళ్ళ జైలు శిక్షతో పాటు రూ. 5 వేల జరిమానా విధిస్తామని మంత్రి తెలిపారు. విలేకరుల సమావేశంలో మంత్రి ఈ వివరాలను వెల్లడించారు. ప్రజలకు ఆవగాహన కోసం 'దీపాలను వెలిగించండి, బాణాసంచా కాదు' అనే ప్రచారాన్ని ఈ నెల 21న ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు. శుక్రవారం సెంట్రల్ పార్క్ వద్ద ఢిల్లీ ప్రభుత్వ నేతృత్వంలో 51 వేల దీపాలను వెలిగిస్తామని మంత్రి వెల్లడించారు. కాగా, ఢిల్లీ ప్రభుత్వం సెప్టెంబర్లోనే జనవరి 1 వరకూ అన్ని రకాల బాణాసంచా ఉత్పత్తి, విక్రయం, ఉపయోగించడాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. గత రెండేళ్ల నుంచి ఢిల్లీలో ఇదే పద్ధతిని అమలు చేస్తున్నారు.