Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఛాన్స్‌లర్‌గా గవర్నర్ దేవవ్రత నియామకంపై అభ్యంతరం
న్యూఢిల్లీ : మహాత్మాగాంధీ 1920లో స్థాపించిన 'గుజరాత్ విద్యాపీఠ్'ను సైతం రాజకీయమయం చేయాలని బీజేపీ పాలకులు భావిస్తున్నారు. దీంతో విద్యాపీఠ్‌కు చెందిన ట్రస్టీల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం గాంధీ విలువలు, పద్ధతులు, అభ్యాసాలను విస్మరించిందనీ, అగౌర వపరిచిందని ట్రస్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవ వ్రతను విద్యాపీఠ్ ఛాన్స్‌లర్‌గా నియమించటాన్ని నిరసిస్తూ 9మంది ట్రస్టీలు రాజీనామా చేశారు. అహ్మదాబాద్‌లోని యూనివర్సిటీ అత్యున్నత నిర్ణయాత్మక మండలి ట్రస్టీల రాజీనామాలను ఆమోదించలేదు. గవర్నర్ దేవవ్రతను ఛాన్స్‌లర్‌గా ఎంపిక చేయటం..రాజకీయ ఒత్తిళ్లుగా పేర్కొంటూ విద్యాపీఠ్‌కు చెందిన 9మంది ట్రస్టీలు మీడియాకు ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. స్వయం ప్రతిపత్తి, ప్రజాస్వామ్యం ప్రాథమిక విలువల్ని కాపాడటం కోసం బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్ దేవవ్రత తిరస్కరించాలని వారు కోరారు. దాదాపు 102 ఏండ్ల చరిత్ర కలిగిన విద్యాపీఠ్‌కు 12వ ఛాన్స్‌లర్‌గా గవర్నర్ దేవవ్రతను అధికార బీజేపీ ఎంపికచేసింది.
దేవవ్రత ఎంపిక ఏకగ్రీవ నిర్ణయం కాదనీ, పూర్తిగా రాజకీయ ఒత్తిళ్తతో కూడినదని ట్రస్టీలు ఆరోపించారు. ఇలా చేయటం గాంధీ విలువల్ని, పద్ధతుల్ని, అభ్యాసాల్ని విస్మరించటంగా వారు పేర్కొన్నారు.