Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుజరాత్ ఎన్నికల కమిషనర్ ప్రకటన దిగ్భ్రాంతికరం : సీతారాం ఏచూరి
- కార్పొరేట్ సంస్థలతో ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి..
న్యూఢిల్లీ : కార్పొరేట్, వ్యాపార సంస్థలు, పారిశ్రామిక యూనిట్లతో గుజరాత్ ఎన్నికల కమిషనర్ చేసుకున్న ఒప్పందంపై సీపీఐ(ఎం) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగులు, కార్మికుల ఓటింగ్ భాగస్వామ్యాన్ని ట్రాక్ చేయటం అప్ర జాస్వామికమని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. వివిధ పారిశ్రామిక యూనిట్లతో కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈమేరకు భారత ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాశారు. ఒప్పందంపై వార్తా కథనాల్ని పేర్కొంటూ, ''కార్మికులు, ఉద్యోగుల ఓటింగ్ భాగస్వామ్యాన్ని ట్రాక్ చేస్తామని ఎన్నికల కమిషనర్ చేసిన ప్రకటన దిగ్భ్రాంతికరం. వెయ్యికిపైగా కార్పొరేట్ సంస్థలతో కలిసి గుజరాత్లో ఓటింగ్ భాగస్వామ్యాన్ని పర్యవేక్షిస్తూ ఈసీ ఒప్పందం చేసుకోవటం సిగ్గుచేటు. ఓటువేయని వారి పేర్లను సంస్థ వెబ్‌సైట్స్‌లో పొందుపర్చటం, ఆఫీస్ నోటీస్‌బోర్డ్‌లో పెట్టడం దారుణం. నిర్బంధ ఓటింగ్ దిశగా బలవంతపు అడుగు ఇది'' అని పేర్కొన్నారు. ''ఆర్టికల్ 326 ప్రకారం భారత రాజ్యాంగం ద్వారా ఓటు హక్కు లభించింది. నిర్బంధ ఓటు హక్కుపై కేంద్రం తన స్పందన తెలియజేయాలని సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశించింది. తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగం..అన్నది దేశంలో ప్రవేశపెడితే, అది అప్రజాస్వామిక వాతావరణాన్ని సృష్టించే అవకాశ ముందని 2015లో కేంద్ర న్యాయశాఖ సుప్రీంకు తెలిపింది. ప్రాథమిక విధిగా ఓటు హక్కును అమలుజేయడం కోసం కార్పొరేట్లతో కలిసి పోల్ ప్యానెల్ చేపట్టిన చర్య రాజ్యాంగ విరుద్ధ''మని లేఖలో ఏచూరి అన్నారు.