Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పతంజలి చేతికి దళితుల భూములు
- రామ్‌దేవ్ బాబా పలుకుబడితో భూముల బదలాయింపు
- హరిద్వార్‌లో బీజేపీ కనుసన్నల్లో బెదిరింపులు
వేలకోట్లకు పైగా తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న రామ్‌దేవ్ బాబా పతంజలి కోసం దళితుల భూములను ఆక్రమించారు. అక్కడి బీజేపీ ప్రభుత్వ సహకారంతో అక్రమంగా భూముల బదలాయింపు చర్యలకు దిగారు. దీనికి నిరాకరించిన దళితులను సామ, దాన, దండోపాయాలతో తమ వశం చేసుకోవటానికి ఎన్నో కుట్రలు పన్నారు. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
న్యూఢిల్లీ : పతంజలి సంస్థకు అవసరమైన భూముల కోసం రామ్‌దేవ్ బాబా బీజేపీ మద్దతుతో అక్రమాలకు పాల్పడినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. దాదాపు ఐదు దశాబ్దాల క్రితం భూసంస్కరణలో భాగంగా ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లా తెలివాలా గ్రామంలోని ప్రతి దళిత కుటుంబానికి ఆరు బిగాల పొలం ప్లాట్లను లీజుకు మంజూరు చేశారు. అయితే, ఆ భూమిలో ఎక్కువ భాగం ఇప్పుడు పతంజలి ఆధీనంలో ఉన్నది. ప్రస్తుతం దళితులలో భూమిలేని చాలా మంది పతంజలిలో పని చేయటం లేదా జీవనోపాధి కోసం వలస వెళ్తున్నారు.
అయితే, ఈ భూమిని పతంజలి సాంకేతికంగా కొనుగోలు చేయలేదు. కారణం, అవిభాజ్య యూపీలో జమీందారీ వ్యవస్థ రద్దు తర్వాత కఠినమైన భ చట్టాలు అమల్లోకి వచ్చాయి. హరిద్వార్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న తెలివాలా గ్రామంలో 1500 మంది దళిత ఓటర్లు నివసిస్తున్నారు. ఈ చట్టాల ప్రకారం దళితుల భూములు దళితులకే బదలాయించాలి. దానికి కూడా భూ వినియోగంలో మార్పుతో పాటు జిల్లా లేదా సబ్‌డివిజనల్ మేజిస్ట్రేటు నుంచి ప్రత్యేక అనుమతి అవసరం.
కానీ పతంజలి, దాని అనుచరగణం ఈ నిబంధనలను ఉల్లంఘించారు. పలుకుబడిని, డబ్బును ఉపయోగించి 2005-2010 మధ్య కాలంలో గ్రామంలోని దళితుల పేర్ల మీద ''విరాళం'' పత్రాలు, రిజిస్ట్రీల ద్వారా దాదాపు 600 బిగాల భూమిని బదిలీ చేయటం, విక్రయించటం, తిరిగి విక్రయించటం చేసింది. అప్పటి నుంచి పతంజలి ఈ భూమిని ఔషధ మూలికలు, చెరుకు వ్యవసాయం చేయటానికి, గోశాలల నిర్వహణకు ఉపయోగించిందని గ్రామస్థులు ఆరోపించారు.
తమ(దళితుల) భూమి యాజమాన్యాన్ని బదిలీ చేయకుండా కంపెనీ ఉపయోగించుకునేలా చాలా దళిత కుటుంబాలకు డబ్బును పతంజలి అనుచరగణం ఇచ్చిందని వివరించారు. అయితే, డబ్బు కారణంగా అనేక మంది గ్రామస్థులు తమ కుటుంబీకుల పేర్ల మీద భూమిని కొనటానికి అనుమతించారు. ఒప్పుకోనివారిపై బలవంతం చేశా రు. వ్యక్తిగత పొలాలనే కాకుండా గ్రామ పంచాయతీకి చెందిన వందలాది బిగాల గ్రామ పంచాయతీ భూమిని స్వాధీనం చేసుకోవటానికి ప్రయత్నిం చింది. అయితే, ఔరంగాబాద్, తెలివాలా వంటి ప్రదేశాలలో గ్రామస్తుల నుంచి ప్రతిఘటన ఎదురు కావటంతో పతంజలి ప్రయత్నాలు సఫలం కాలేదు. గతంలో పట్వారీ గులాబ్ సింగ్, మాజీ ప్రధాన్ కురాడి సింగ్ పతంజలికి అనేక రిజిస్ట్రీలను చర్చలు జరిపేందుకు సహాయం చేశారని పలువురు గ్రామస్తులు తెలిపిన తెలివాలా వంటి ప్రదేశాలలో వ్యక్తిగత బదిలీలు సజావుగా జరిగాయి. పతంజలి కోసం తన ద్వారా, తన భార్య, సోదరుడు, కుమారుడు, డ్రైవర్ల పేర్ల మీద ఇతర దళిత కుటుంబాల నుంచి పరోక్షంగా వంద బిఘాలను కొనుగోలు చేసినట్టు మహేంద్ర సింగ్ (52) చెప్పారు. అయితే, ఈ భూమి అంతా చివరకు గులాబ్‌సింగ్ మామ అమర్ సింగ్‌కు తిరిగి అమ్మినట్టు వివరించాడు. గులాబ్ సింగ్‌కు ఇక్కడ రామ్‌దేవ్ మనిషిగా పేరున్నది. పట్వారీగా ఆయనకు ప్రతి భూమిపై అవగాహన ఉన్నది. ''పతంజలి సీనియర్ వర్కర్ అయిన దేవేంద్ర చౌదరీ నా దగ్గరకు వచ్చాడు. 'నీ పేరు మీద భూమిని బదలాయించుకో. మేము డబ్బు అందిస్తాం. పేర్లు మాత్రమే నీవి' అని చెప్పాడు. భూమి అమ్మేవారికి చౌదరీ డబ్బులు ఇచ్చేవాడు'' అని మహేంద్ర చెప్పారు.
భూ రికార్డుల ప్రకారం.. మహేంద్ర, ఆయన కుటుంబం ప్లాట్లను కొని విక్రయించారు. 2008లో 18 సార్లు, 2007లో ఏడు సార్లు, 2009లో 21 సార్లు అగ్రిమెంట్లపై సంతకాలు చేశారు. మహేంద్ర చెప్పి నట్టుగానే భూములు చేతులు మారినట్టు రికార్డులు చెప్తున్నాయి. 2009 జనవరిలో అమర్ 1.8 హెక్టార్ల భూమిన మహేంద్ర నుంచి రూ. 9.60 లక్షలకు, కురాడీ నుంచి రూ. 10,15,000కు 1.9 హెక్టార్ల భూమిని కొను గోలు చేశాడు. ''రామ్‌దేవ్, బాలకృష్ణలకు ఈ పనులకు రాలేదు. దేవేంద్ర, పంకజ్‌లు ఇదంతా చేసేవారు. గులాబ్‌సింగ్ భూముల గురించి సమాచా రమిచ్చేవాడు. పంకజ్ డబ్బులిచ్చే వ్యక్తి'' అని మహేంద్ర ఆరోపించారు. భూమి కొనుగోలు కోసం తాను రుణం తీసుకున్నానీ, అయితే, పతంజలీ ఎన్నటికీ దానిని తిరిగి కొనుగోలు చేయకపోవటంతో 2009లో తాను నష్టాన్ని చవి చూశానని మహేంద్ర చెప్పారు. '' మహేంద్ర సింగ్, ఆయన కుమారుడు అర్జున్, ముర్సాలిన్తో పాటు చాలా మంది వ్యక్తులు రామ్‌దేవ్ బాబా కోసం భూమిని కొనుగోలు చేశారు. పతంజలి వ్యక్తులు డబ్బును అందించేవారు. ఆ భూమి దళితుడి పేరు మీద ఉంటుంది. కానీ, నిజానికి పతంజలి ఆధీనంలోకి వస్తుంది. దాతృత్వం పేరుతో కొంత మంది నుంచి భూమి కూడా తీసుకున్నారు. దానికి డబ్బు చెల్లించారు'' అని తేలీవాల్ ప్రధాన్ జాన్ మహ్మద్ ఆరోపించారు. హరిసింగ్ అనే వృద్ధుడు మాట్లాడుతూ.. తెలివాలాలో 80 శాతం మంది దళితులు ఇప్పుడు భూమి లేని వారుగా ఉన్నారన్నారు. '' 2005 నుంచి 2010 మధ్య మా గ్రామం లో చాలా భూములు అమ్ముడయ్యాయి. మా గ్రామంలో భూ మాఫియా రెచ్చిపోయింది. ఎవరైనా తన భూమిని అమ్మటానికి విక్రయించకపోలే వారిని ఆకర్షించటం, వినకపోతే ఒత్తిడి చేయటం చేసేవారు'' అని వివరించాడు.
మధ్యవర్తులు, వారి కుటుంబాలు
తన భార్య మమతా రాణి, ఆయన తల్లి ప్రేమవతి పేర్లతో 35 బిఘాలను కొనుగోలు చేయటం గురించి మాట్లాడుతున్నప్పుడు దేవేంద్ర, పంకజ్‌ల వంటి వారు అనేక ఆరోపణలను వినిపించారు. స్వామీజి ట్రస్టు కు భూమి అవసరమని గులాబ్ సింగ్ చెప్పారని రామ్‌దేవ్‌ను ఉద్దేశించి అన్నారు. భూమి రికార్డుల ప్రకారం, కుమార్, ఆయన కుటుంబం 2008లో సుమారు 18 సార్లు భూమిని కొనుగోలు చేసి విక్రయించారు. మొత్తం 1.4 హెక్టార్లను రూ. 9.25 లక్షలకు కొనుగోలు చేశారు. అలాగే, భూమిని పొందేందుకు పతంజలి ఇతర మోసపూరిత మార్గాలనూ ఉపయోగిస్తుందనే ఆరోపణలూ ఉన్నాయి. 2009లో కురాడి మరణించిన మూడు రోజుల తర్వాత, మాజీ ప్రధాన్ భూములను పట్వారీ సహాయకులకు బదిలీ చేయాలని ఒత్తిడి చేసేందుకు గులాబ్ ఆయన కుటుంబాన్ని సంప్రదించినట్టు కురాడి కుమారులు తెలిపారు. '' మా నాన్న ఎవరి కోసం ఆ భూమిన కొన్నారో నాకు తెలియదు. కానీ, చనిపోయిన మూడ్రోజుల తర్వాత గులాబ్‌సింగ్ మా ఇంటికి వచ్చి తన భూములు నాన్న పేరు మీద ఉన్నాయనీ, వాటిని తిరిగి ఇచ్చేయాలని అడిగాడు'' అని అర్జున్ వివరించాడు. భూ రికార్డుల ప్రకారం, కురాడి, అర్జున్ 2006లో ఆరు సార్లు, 2007లో నాలుగు సార్లు, 2008లో ఆరు సార్లు, 2009లో 11 సార్లు భూమిని కొనుగోలు చేసి విక్రయించారు. అయితే, ఈ ఏడాది మరణించిన ధేనుపురా గ్రామానికి చెందిన సోంపాల్ ద్వారా భూములను తిరిగి పతంజలికి బదిలీ చేయటానికి అంగీకరిచిన ప్పటికీ.. సంస్థ సహచరులు మోసం చేసి మరింత సంపాదించ టానికి ప్రయత్నించారని అర్జున్ వివరించాడు. '' పతంజలితో కుదిరిన ఒప్పందం 8 బిఘాల భూమిని విక్రయించటం. కానీ, మేము దానిని విక్రయించటానికి వెళ్లినప్పుడు వారికి 28 బిఘా లు బదిలీ చేయబడ్డాయి. వాటిలో 8 బిఘాలు రిజిస్ట్రీ ద్వారా విక్రయించబడ్డాయి. 20 బిఘాలు విరాళంగా ఇవ్వబడ్డాయి. మమ్మల్ని మోసం చేశారు. మేము 20 బిఘాల భూమిని దానం చేసే ంత ధనవంతులను కాదు. దీనిని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లాం. ఎనిమిది బిఘాలు వారి వద్దకు వెళ్లాయి. కానీ, మా నియంత్రనలో ఉన్న 20 బిఘాలపై స్టే ఉన్నది. పతంజలి తరఫున రాజు వర్మ వస్తారు'' అని అర్జున్ వివరించాడు. హరి ద్వార్‌లో కనీసం 20 భూ వివాదాల్లో పతంజలి తరఫున న్యాయవాది రాజు వర్మ వాదిస్తున్నాడు.
ఇక్కడ బదిలీలు బలవంతంగా జరిగాయని గ్రామస్థులు ఆరోపించారు. తెలివాలాలోని శ్యామ్సింగ్ (42) మాట్లాడుతూ.. ''తమ భూమిని పతంజలికి కొందరు వ్యక్తులు బలవంతంగా విక్రయించవలసి వచ్చింది. పతంజలి భూమి మధ్యలో నా క్షేత్రం ఉన్నది. వారు నా భూమిని చుట్టుముట్టే కంచె వేశారు. దారులన్నీ మూసుకు పోయాయి. ప్రజలు తమ భూమిని అమ్ముకోవటం తప్ప వేరే మార్గం లేదు'' అని ఆరోపించాడు. 'యోగ్ సే ఉద్యోగ్' అనే పేరుతో 2011లో తెహెల్కా ఒక నివేదికను ప్రచురిం చింది. పదార్తా లోని పతంజలి ఫుడ్ పార్క్‌ను తనిఖీ చేస్తున్న ప్పుడు ఒక సీనియర్ అధికారి కోతకు సిద్ధంగా ఉన్న పొలాన్ని గమనించి, పంటలు ఎవరికి చెందినవని అడిగారు. '' ఈ భూమి అమ్మటానికి సిద్ధంగా లేని కొంత మంది పనికి మాలిన రైతులకు చెందినది. అయినా వారు ఎక్కడికి వెళ్తారు. అలసిపోయి మా కాళ్లపై పడతారు'' అని పతంజలి వ్యవస్థాపకుడు, రామ్‌దేవ్ బాబా స్నేహితుడైన బాలకృష్ణ మాట్లాడటం గమనార్హం. పతంజలి అదే ఏడాది దాదాపు 1650 బిఘాలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించింది. ఔరంగాబాద్ గ్రామ నివాసితులు ఇదే విధమైన యుద్ధం చేశారు. చాలా వరకు వారు ఈ బదిలీని ఆపగలిగారు. గ్రామసభకు చెందిన వందలాది బిఘాల భూమిని రక్షించినప్పటికీ, పతంజలి ఇప్పటికీ 150 బిఘాల భూమిని ఆక్రమించిందని పంచాయతీ సభ్యుడిగా ఉన్న చరన్సింగ్ చౌహాన్ తెలిపాడు. పతంజలికి ఖాళీ భూమిని ఇస్తున్నట్టు తెలియజేసేందుకు పరిపాలన యంత్రాంగం మాకు లేఖ రాసిందనీ, భూమినివ్వటానికి మా గ్రామ సభ స్పష్టంగా నిరాకరించిందని వివరించాడు. పతంజలి గురించి మేము రాతలు రాసినా, నివేదికలు తయారు చేసినా.. ప్రభుత్వం, అధికారులు, పత్రికా యాజమాన్యాల కారణంగా ఫలితం కనిపించలేదని హరిద్వార్‌లోని ప్రెస్‌క్లబ్ సభ్యుడు తెలిపాడు. బాబా గురించి రాసి శత్రువులుగా మారటం దేనికనీ, అందరూ మౌనంగా ఉన్నారని తమ సంపాదకులు తమను అడిగేవారని చెప్పారు.
పంచాయతీ విరాళాలపై స్థానికుల ఆగ్రహం
వ్యక్తిగత బదిలీలతో పాటు, తెలివాలాలలోని దాదాపు 600 బిఘాల గ్రామ పంచాయతీ భూమిని కూడా 2008లో పతంజలిగి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. బదిలీకి '' అభ్యంతరం లేదు'' అని అప్పటి ప్రధాన్ అశోక్ సైనీ హరిద్వార్ జిల్లా మేజిస్ట్రేటుకు లేఖనూ రాశారు. అయితే, ఇది హరిసింగ్ అనే గ్రామస్థుడు ఆర్టీఐ ద్వారా తెలుసుకోగలిగాడు. కాగా, సైనీ లేఖ రాసిన 18 రోజుల్లోనే బాలకృష్ణ అదనపు జిల్లా మేజిస్ట్రేటుకు గ్రామస్థలం కోసం డిమాండ్ నోట్‌ను సమర్పించారు. అనంతరం ఒక వారంలో ఆ ప్రాంతంలో పర్యటనకు సంబంధించి అదనపు డీఎం.. డీఎంకు లేఖ కూడా రాయటం గమనార్హం. అయితే, బదిలీ అధికారికంగా జరగకముందే గ్రామస్థులకు విషయం తెలిసింది. '' మా భూమిని పతంజలికి ఇవ్వటం ఇష్టం లేదు. దీనిని గుర్తించి అఫిడవిట్‌ను సిద్ధం చేశాం'' అని గ్రామ సమావేశంలో గ్రామస్థులు తెలిపినట్టు హరిసింగ్ పేర్కొన్నారు.