Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2023 జనవరి 6 నుంచి 9 వరకు కేరళలో...
న్యూఢిలీ: ఐద్వా 13వ అఖిల భారత మహాసభ లోగో ఆవిష్కరించారు. ఈ మేరకు గురువారం నాడిక్కడ హరికిషన్ సింగ్ సుర్జీత్ భవన్లో ఐద్వా నేతలు లోగోను ఆవిష్కరించారు. ఐద్వా సెంట్రల్ ఎగ్జిక్యూటీవ్ కమిటీ (సీఈసీ) సమావేశం జరిగింది. మహాసభలో ప్రవేశపెట్టే నివేదికపై చర్చించారు. అనంతరం ఐద్వా నేతలు మహాసభ లోగోను ఆవిష్కరించారు. ఐద్వా జాతీయ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాలినీ భట్టాచార్య, మరియం దావలే, కోశాధికారి ఎస్.పుణ్యవతి, కేరళ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి కెకె శైలజ, మాజీ ఎంపీలు శ్రీమతి టీచర్, సుజాత, సతీదేవి, సీమా తదితరులు పాల్గొన్నారు. 2023 జనవరి 6 నుంచి 9 వరకు కేరళలోని తిరువనంతపురంలో ఐద్వా అఖిల భారత మహాసభ జరగనున్నట్టు ఆ సంఘం నేతలు తెలిపారు. ''సమానత్వం కోసం ఐక్య పోరాటం'' అనే నినాదంతో మహాసభ జరగనున్నది.