Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చట్ట సభల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలి
- ఢిల్లీలో బీసీ సంక్షేమ సంఘం ధర్నా
న్యూఢిల్లీ : బీసీ జనగణన చేయాలని రాజ్యసభ ఎంపీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం నాడిక్కడ ఏపీ, తెలంగాణ భవన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్త రాది రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో బీసీలు పాల్గొన్నారు. ఈ సందర్భ ంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి, చట్ట సభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించటానికి చర్యలు తీసుకో కపోతే దేశంలో తిరుగుబాటు జరుగుతుందని హెచ్చరించారు. అలాగే జనాభా గణనలో బీసీల కులగణన చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశా రు. రూ.38 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో బీసీలకు కేవలం రూ.1,400 కోట్లు కేటాయించడమంటే, వెనకబడిన వర్గాలకు బిచ్చం వేయడమే నన్నారు. కేంద్ర శాఖల్లో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉద్యోగాలు దక్కేలా ప్రయివేటు రంగంలో రిజ్వర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు, జ్యూడిషియరీ పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేషనల్ కన్వీనర్ గుజ్జ కృష్ణ, జబ్బల శ్రీనివాస్, కిరణ్, వర ప్రసాద్, కె.మోక్షిత్, చంద్రశేఖర్, సున్నం మల్లికార్జున్, ఓం ప్రకాశ్, బద్ర, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.