Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరిగిన సాగు వ్యయాన్ని పరిగనణలోకి తీసుకోలేదు
- పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలి : ఏఐకేఎస్ పిలుపు
న్యూఢిల్లీ : ఎంపిక చేసిన ఖరీఫ్, రబీ పంటలకోసం ప్రతీ ఆరు నెలలకొకసారి ప్రకటించే ఎంఎస్పీతో రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదని ఏఐకేఎస్ మరోసారి పునరుద్ఘాటించింది. ఎందుకంటే కనీసం ఈ ఎంఎస్పీతో కూడా పంట ఉత్పత్తులను కేంద్రం సేకరించడం లేదని, దీంతో స్థానిక వ్యాపారులకు ఈ ఎంఎస్పీ కంటే చాలా తక్కువ ధరకు రైతులు విక్రయించాల్సి వస్తుందని ఏఐకేఎస్ విమర్శించింది. రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పీని ఏఐకేఎస్ ఖండించింది. స్వామినాథన్ కమిషన్ సూత్రాన్ని ఉపయోగించి ఎంఎస్పీని ప్రకటించాలని ఏఐకేఎస్ మరోసారి పునరుద్ఘాటించింది. పూర్తి సాగు వ్యయం కంటే ఒకటిన్నర రెట్లు ఎంఎస్పీకి చట్టపరమైన హామీ కోసం భారత రైతాంగం తమ దేశవ్యాప్త పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని ఎఐకెఎస్ పిలుపునిచ్చింది. రబీ మార్కెటింగ్ సీజన్ 2022-23 సంబంధించిన పంటల కోసం ఇటీవల ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్పి)తో మోడీ ప్రభుత్వం తన రైతు వ్యతిరేక వైఖరిని మరోసారి ప్రదర్శించిందని ఆరోపించింది. మోడీ ప్రభుత్వం ప్రకటించిన ధరలు చాలా తక్కువగా ఉన్నాయి, అలాగే స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసిన కాస్ట్ సి2పై 50 శాతం రాబడులను రైతులకు ఎప్పటికీ అందించలేదు. ప్రకటించిన ఎంఎస్పిలో వృద్ధి చాలా తక్కువగా ఉంది. తీవ్రంగా పెరిగిన సాగు వ్యయానికి, లేదా రైతులు కొనుగోలు చేయాల్సిన వినియోగ వస్తువుల ధరల ద్రవ్యోల్బణం కంటే తక్కువగా ఉందని తెలిపింది. గోధముల్లో ఎంఎస్పీ కేవలం 5.5 శాతం మాత్రమే పెరిగింది. శెనగల్లో కేవలం 2 శాతం మాత్రమే పెంచారు. మరోవైపు ఈ ఏడాదిలో ఆహార వినియోగ ధరల ద్రవ్యోల్బణం 7 శాతం కంటే ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే.