Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మతం పేరిట ఎక్కడికి పోతున్నాం?
- ఇది 21వ శతాబ్దం : సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ:విద్వేష ప్రసంగాలను అడ్డుకోవాలని.. పోలీసులు, సంబంధిత ప్రభుత్వ అధికారులు వాటిపై కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. లేదంటే కోర్టు ధిక్కారణ అభియోగాల్సి ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ద్వేషపూరిత ప్రసంగాలు చేసే వ్యక్తులపై..మతాలకు అతీతంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నది. దేశంలో ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని భయభ్రాంతులకు గురిచేస్తున్న ఘటనలను అరికట్టే విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. జస్టిస్ కె.ఎం.జోసెఫ్, జస్టిస్ హృషికేశ్ రారులతో కూడిన ధర్మాసనం శుక్రవారం దీనిని విచారించింది. ఈ తరహా కేసుల్లో ఇప్పటివరకు ఎటువ ంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని కేంద్రంతోపాటు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ పోలీస్ ఉన్నతాధికారుల నుంచి ధర్మాసనం నివేదిక కోరింది. పిటిషన్పై విచారణ సందర్భంగా ...''ఇది 21వ శతాబ్దం. మతం పేరిట మనం ఎక్కడికి చేరుకున్నాం? లౌకిక దేశంలో ఈ పరిస్థితి దిగ్భ్రాంతికరం. భారత రాజ్యాంగ శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం గురించి చెబుతోంది. దేశంలో ద్వేషపూరిత వాతావరణం నెలకొంది. కొన్ని అంశాల్లో ప్రజల దృష్టి మరల్చేందుకు ఇలాంటి ప్రసంగాలు చేస్తున్నారు. ఇలాంటి వాటిని సహించలే''మని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ద్వేషపూరిత నేరాలు, ప్రసంగాలను అరికట్టేందుకు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) ప్రయోగించటం వంటి కఠినమైన చర్యలు తీసుకోవాలని పిటిషనర్ అభ్యర్థించారు. ద్వేషపూరిత నేరాలు, ప్రసంగాలపై స్వతంత్ర విచారణ చేపట్టేలా కేంద్రం, రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ షాహీన్ అబ్దుల్లా సుప్రీంను కోరారు.