Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : బిల్కిస్ బానో కేసులో దోషులను విడిచిపెట్టడాన్ని సవాలు చేస్తూ దాఖలైన తాజా పిటిషన్‌పై విచారించడానికి సుప్రీం అంగీకరించింది. ప్రధాన పిటిషన్‌తో కలిసి దీన్ని విచారిస్తామని తెలిపింది. 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానో సామూహిక అత్యాచారానికి గురి కాగా, 14మంది హత్యకు గురయ్యారు. వీరిలో కొంతమంది బానో కుటుంబ సభ్యులే. ఈ కేసులోని దోషులకు శిక్ష తగ్గించడాన్ని, వారిని విడుదల చేయడాన్ని సీపీఐ మహిళా విభాగమైన భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్ఎఫ్ఐడబ్ల్యు) సవాలు చేసింది. దోషులకు శిక్ష తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ ఆగస్టులో సీపీఐ(ఎం) నేత సుభాషిణి అలీ, స్వతంత్ర జర్నలిస్టు, చిత్ర నిర్మాత రేవతి లాల్, మాజీ ఫిలాసఫీ ప్రొఫెసర్, కార్యకర్త రూప్రేఖ వర్మలు పిల్ దాఖలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, మాజీ ఐపిఎస్ అధికారి మీరన్ చాదా, మాజీ ఐఎఫ్ఎస్ అధికారి మధు బాధురి, సామాజిక కార్యకర్త జగదీప్ చోకర్లు దాఖలు చేసిన పిటిషన్లను కూడా సుప్రీం పరిశీలిస్తోంది. కేంద్ర ప్రభుత్వ అనుమతితో గుజరాత్ ప్రభుత్వం ఆగస్టు 15న వీరిని విడిచి పెట్టింది.