Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖండిస్తూ పోలీసులకు ఫిర్యాదు : తీస్తా సెతల్వాద్
న్యూఢిల్లీ : ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్) తనను అరెస్టు చేసే సమయంలో హింసకు పాల్పడినట్టు సామాజిక కార్యకర్త తీస్తాసెతల్వాద్ ఫిర్యాదుచేశారు. గుజరాత్ మారణహౌమంలో ప్రధాని మోడీకి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేస్తున్నట్టు ప్రకటించిన తర్వాత.. తీస్తాను ఈ ఏడాది జూన్ 25న ఏటీఎస్ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అరెస్టు అనంతరం అహ్మదాబాద్‌కు తరలించడానికి మధ్య జరిగిన పరిణామాలపై ఆమె శాంతాక్రూజ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు ఇటీవల ఓ జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. జులై 25 మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో నొయిడాలోని సెంట్రల్ ఇండిస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) నుంచి తన ఆఫీసుకు ఫోన్‌కాల్ వచ్చిందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఫోన్‌కాల్ వచ్చిన గంటన్నర తర్వాత అదే రోడ్లో ఉంటున్న బీజేపీ ఎంపీ నారాయణ రానే నివాసం నుంచి ఇద్దరు సీఐఎస్ఎఫ్ వ్యక్తిగత భద్రతా అధికారులు (పీఎస్ఓ) తన నివాసానికి వచ్చారని చెప్పారు. నిమిషాల్లోనే సుమారు 10 మంది ఏటీఎస్ అధికారులు వచ్చారని చెప్పారు.
వారెంట్, ఎఫ్ఐఆర్ చూపించలేదనీ, తన లాయర్ వచ్చేదాకా వేచి ఉండాలని చెప్పినా వినలేదని ఆరోపించారు. అహ్మదాబాద్‌కు చెందిన ఏటీఎస్ అధికారి జె.ఎం.పటేల్ బెడ్రూమ్లోకి వచ్చారనీ.. తనపై దాడి చేశారనీ, తన చేతికి గాయమైందని పేర్కొన్నారు. గుజరాత్ ప్రభుత్వం, పోలీసులు ప్రవర్తించిన తీరుతో తన ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన వాంగ్మూలాన్ని తీసుకునేందుకు శాంతాక్రూజ్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళుతున్నామని చెప్పిన ఏటీఎస్ అధికారులు తనను తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు. తీస్తాను గుజరాత్‌లోని మహిళా జైలులో 63 రోజుల పాటు రిమాండులో ఉంచారు.