Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈటానగర్ : ఆర్మీకి చెందిన అత్యాధునిక తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ (ఎఎల్‌హెచ్) శుక్రవారం అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఎగువ సియాంగ్ జిల్లా ట్యుటింగ్ ప్రాంతంలో శుక్రవారం కూలిపోయింది. ఈ హెలికాప్టర్లో ఐదుగురు ప్రయాణిస్తుండగా, ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు ఆర్మీ వర్గాలు తెలిపాయి. జిల్లా కేంద్రం సింయాంగ్ నుంచి 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ప్రాంతానికి రహదారి మార్గం లేకపోవడంతో .. మిగ్ -17 యుద్ధ విమానంతోపాటు రెండు ధ్రువ్ హెలికాప్టర్లు అక్కడికి చేరుకున్నాయని పేర్కొన్నాయి. స్థానికులు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని తెలిపాయి. మిగిలిన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.