Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పులిట్జర్ అవార్డు కమిటీ కో ఛైర్మన్
న్యూఢిల్లీ : పులిట్జర్ అవార్డు వేడుకల్లో పాల్గొనకుండా కాశ్మీరీ జర్నలిస్టును అడ్డుకోవడం అత్యంత వివక్షతతో కూడుకున్నదని పులిట్జర్ అవార్డు కమిటీ కో చైర్మన్ జాన్ డానిస్జెవ్స్కీ పేర్కొన్నారు. ఈ నెల 20న న్యూయార్క్లో పులిట్జర్ అవార్డుల ప్రదానోత్సవానికి మట్టూ హాజరుకాకపోవడంపై జాన్ చేసిన వ్యాఖ్యలను పులిట్జర్ అధికారిక ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఇది నీచమైన, అత్యంత వివక్షతతో కూడుకున్న చర్య అని.. ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొనే సవాళ్లకు ప్రతీక అని జాన్ పేర్కొన్నారు.
అమెరికా వీసా, టికెట్ ఉన్నప్పటికీ కాశ్మీర్ జర్నలిస్ట్ సన్నా అర్షద్ మట్టూని ఈ నెల 18న ఢిల్లీ విమానాశ్రయ అధికారులు అడ్డుకున్న సంగతి తెలిసిందే.