Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ. 1,338 కోట్ల జరిమానా
బెంగళూరు : గూగుల్‌కు చెందిన ఆల్ఫాబెట్ ఇంక్‌కు కేంద్ర ప్రభుత్వం భారీ మొత్తంలో జరిమానా విధించింది. ఆండ్రాయిడ్ మొబైల్ పరికరాలకు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు గాను గూగుల్‌కు రూ.1,338 కోట్లను జరిమానా విధించినట్టు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) జరిమానా విధించింది. గూగుల్ స్మార్ట్‌ఫోన్ తయారీదారులకు ఎలాంటి ప్రోత్సాహకాలను అందించకూడదని ఆదేశించింది. ఈ వార్తపై గూగుల్ స్పందించాల్సి వుంది. గూగుల్ ఇప్పటికే భారత్‌లో పలు కేసులను ఎదుర్కొంటోంది.