Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేస్తుండగా విషవాయువులు వెలువడడంతో, తమిళనాడు, మహారాష్ట్రలో ఐదుగురు కార్మికులు శుక్రవారం ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడు రాజధాని చెన్నైకి 47 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీపెరంబుదూర్‌లో ఒక రిసార్ట్‌లోని సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ ముగ్గురు మృతి చెందారు. మహారాష్ట్రలోని పూణే పట్టణంలోని వాఘోలి ప్రాంతంలో ఒక హౌసింగ్ సొసైటీలోని సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ ఇద్దరు కార్మికులు మరణించారు. మరొక కార్మికుడు లోపల ఉన్నట్లు అనుమానిస్తున్నారు.