Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదు నెలల్లో రూ.లక్షా 55 వేల కోట్ల ద్వైపాక్షిక వాణిజ్యం
- అందులో భారత్ ఎగుమతులు రూ.8258 కోట్లు
న్యూఢిల్లీ : భారత్-రష్యా దైపాక్షిక వాణిజ్యం మునుపెన్నడూ లేనంతగా రికార్డుస్థాయికి చేరుకుంది. ఏప్రిల్-ఆగస్టు.. ఐదు నెలల కాలంలో ఇరుదేశాల వాణిజ్యం 1822 కోట్ల డాలర్లుకు (సుమారుగా రూ. లక్షా 55వేల కోట్లు) చేరుకుంది. ఇందులో అత్యధికంగా రష్యా నుంచి 1723 కోట్ల డాలర్లు విలువజేసే చమురు, ఎరువులు దిగుమతి కాగా, రష్యాకు భారత్ నుంచి 99 కోట్ల డాలర్లు (రూ.8258కోట్లు) విలువజేసే ఎగుమతులు జరిగాయి. వాణిజ్యశాఖ విడుదల చేసిన తాజా గణాంకాలను బట్టి, ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యంలో భారత్కు పెద్దఎత్తున వాణిజ్యలోటు కనపడుతోంది. భారత్తో వాణిజ్య భాగస్వామ్యం కలిగిన దేశాల్లో రష్యా ఇప్పుడు ఏడవ అతిపెద్ద దేశంగా అవతరించింది. అమెరికా, చైనా, యుఏఈ, సౌదీ అరేబియా, ఇరాక్, ఇండోనేషియా..వరుసగా మొదటి ఆరు స్థానాల్లో ఉన్నాయి. భారత్-రష్యా ద్వైపాక్షిక వాణిజ్యంలో రష్యా వాటా 2021-22లో 1.27శాతం ఉండగా, ఈ ఏడాది 3.54శాతానికి చేరుకుంది. 1997-98లో రష్యా వాటా 2.1శాతం కాగా, గత 25ఏండ్లలో ఎన్నడూ 2శాతం దాటలేదు.