Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆప్ సర్కారుకు ఎన్ఎంఓపీఎస్ సెక్రెటరీ జనరల్ స్థితప్రజ్ఞ కృతజ్ఞతలు
- తెలంగాణలోనూ సీపీఎస్‌ను రద్దు చేయాలి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పంజాబ్‌లో పాత పెన్షన్ అమలు చేయడం పట్ల ఆప్ ప్రభుత్వానికి నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం (ఎన్ఎంఓపీఎస్) సెక్రెటరీ జనరల్ స్థితప్రజ్ఞ, తెలంగాణ సీపీయస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ కృతజ్ఞతలు తెలిపారు. తమ సంఘం చేసిన కృషి వల్ల పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆప్ మ్యానిఫెస్టోలో పాత పెన్షన్ అమలు చేస్తామంటూ ప్రకటించిందని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పాత పెన్షన్‌ను అమలు చేస్తామంటూ ప్రకటించారని పేర్కొన్నారు. దీంతో ఉద్యోగులు, ఉపాధ్యాయుల కుటుంబాలు సంతోషంగా ఉన్నాయని వివరించారు. ఇప్పటికే దేశంలో రాజస్థాన్, ఛతీస్ఘడ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్లో సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేస్తున్నాయని తెలిపారు. ఐదో రాష్ట్రంగా పంజాబ్‌లో పాత పెన్షన్ అమలు చేసేం దుకు ఈనెల 29న నోటిఫికేషన్ ఇస్తుందని పేర్కొ న్నారు. ఆరో రాష్ట్రంగా తెలంగాణలోనూ సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ను అమలు చేయాలని కోరారు. పాత పెన్షన్ అమలు చేసే రాష్ట్రాల్లో ఇప్పుడు ఏడాదికి రూ.7 వేల కోట్లు, గత 18 ఏండ్లుగా పీఎఫ్ఆర్డీఏ దగ్గర ఉన్న రాష్ట్ర పెన్షన్ ఫండ్ రూ.30 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్లు రాష్ట్ర ఆదాయానికి చేకూరుతాయని వివరించారు. ఇటీవల సీపీఎస్‌ను రద్దు చేసిన రాజస్థాన్‌కు బడ్జెట్ లో 23.26 శాతం దాదాపు రూ.41 వేల కోట్లు ఎన్పీఎస్ ట్రస్ట్ నుంచి చేకూరిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సీపీఎస్ ఉద్యోగులకు గ్రాట్యుటీ, కుటుంబ పెన్షన్ అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించి దేశవ్యాప్తంగా ఉన్న 85 లక్షల ఉద్యోగులు, ఉపాధ్యా యులకు పాత పెన్షన్ అమలు చేయాలని కోరారు. తద్వారా రాష్ట్రంలో 1.75 లక్షల ఉద్యోగుల కుటుం బాలకు సామాజిక, ఆర్థిక భద్రత కల్పించాలని సూ చించారు. రాబోయే మహబూబ్ నగర్- రంగారెడ్డి -హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఎస్ యూనియన్ పోటీ చేస్తుందని తెలిపారు.