Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 15 మంది వలస కార్మికుల దుర్మరణం
- మరో 40 మందికి తీవ్రగాయాలు
మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లా దియేందర్ పట్టణం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి సమయంలో వెళ్తున్న ట్రక్కు ముందు వెళ్తున్న గుర్తుతెలియని వాహనాన్ని ఢకొీట్టింది. దీంతో, ఒక్కసారిగా ఆగడంతో వెనుక నుంచి వస్తున్న ప్రయివేటు బస్సు ట్రక్కును ఢకొీంది. దీంతో, బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. సంఘటనా స్థలంలోనే 12 మంది మరణించగా, ఇద్దరు థియేందర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు రేవా జిల్లా కలెక్టర్ మనోజ్ పుష్ప్ తెలిపారు. బస్సు డ్రైవర్, కండక్టర్‌సహా పలువురి మృతదేహాలు ఛిద్రమయ్యాయి. గాయపడిన వారిలో తీవ్రంగా గాయపడిన వారిని రేవా ఆసుపత్రికి తరలించినట్లు రేవా జిల్లా ఎస్పీ నవ్‌నీత్ బాసిన్ చెప్పారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సుమారు 60 మంది వలస కార్మికులు దీపావళి పండగకు తమ స్వగ్రామాలకు ఘోరక్పూర్ వెళ్లే ప్రైవేటు బస్సులో వెళుతుండగా, ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. స్వల్పగాయాలకు గురైన ప్రయాణికులు 25 మందిని ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా ఉత్తర ప్రదేశ్ పంపించినట్టు చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున నష్టపరిహారం అందజేయనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నాయి. గాయపడిన వారి వైద్య ఖర్చులను మధ్యప్రదేశ్ ప్రభుత్వం భరిస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ సానుభూతి తెలియజేశారు.