Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : వివిధ కేసుల పరిశోధనలో ఉత్తమ పని తీరు కనపర్చిన పోలీసు అధికారులకు 'కేంద్ర హౌం శాఖ మంత్రి పరిశోధన ప్రతిభ అవార్డు ల''ను ఆ శాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 151 మందికి అవార్డులు ప్రకటిం చగా అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన ఐదుగురు చొప్పున అవా ర్డులు సాధించారు. తెలంగాణ నుంచి అవార్డులు సాధించిన వారిలో ప్రతా పగిరి వెంకటరమణ (డీఎస్పీ), రుద్రవరం గాండ్ల శివమారుతి (ఏసీపీ), ఆశా ల గంగారాం (డీఎస్పీ), వెగ్గళం రఘు (డీఎస్పీ), బుజూర్ అంజిరెడ్డి (ఇన్స్ స్పెక్టర్) ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి అవార్డులు సాధించిన వారిలో బి. సీతా రామయ్య(డీఎస్పీ), కొల్లి శ్రీనివాసరావు (డీఎస్పీ), ముత్యాల సత్యనారాయణ (ఇన్స్పెక్టర్), కన్నోజు వాసు(ఇన్స్పెక్టర్), షేక్ ఖాదర్బషా (ఎస్ఐ) ఉన్నారు.