Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హిమాచల్, జమ్మూకాశ్మీర్‌లో రైతుల ఆందోళన
- ప్రధాని మోడీకి ఎఎఫ్‌ఎఫ్‌ఐ లేఖ
న్యూఢిల్లీ : యాపిల్‌కు లాభదాయక ధర ప్రకటించాలని యాపిల్ ఫార్మర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్ఎఫ్ఐ) డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం నాడు ఏఎఫ్ఎఫ్ఐ ఇచ్చిన 'నేషనల్ యాపిల్ డే' పిలుపులో భాగంగా హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకాశ్మీర్‌తో పాటు దేశంలోని యాపిల్ సాగు ప్రభావిత ప్రాంతాల్లో యాపిల్ రైతులు ఆందోళన చేపట్టారు. ఆయా రాష్ట్రా ల్లో స్థానిక పరిపాలన కార్యాలయాల వెలుపల ప్రదర్శనలు జరిగాయి. హిమా చల్లోని థియోగ్, నిర్మాండ్, జమ్మూకాశ్మీర్‌లోని కుల్గామ్‌లోని మినీ సెక్రటేరి యట్‌లోని అధికారులకు ఏడు డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను అందజే శారు. శ్రీనగర్‌లోని ప్రెస్‌క్లబ్ బయట పెద్ద ప్రదర్శన నిర్వహించారు. యాపిల్ రైతుల ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశా రు. దేశంలో మొత్తం ఆపిల్ ఉత్పత్తిలో 95 శాతం కంటే ఎక్కువ వాటా కలిగిన హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకాశ్మీర్‌ల్లో యాపిల్ రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారని ఆరోపించారు. అందుకు కేంద్ర, ఆయా రాష్ట్ర ప్రభుత్వ విధానాలే కారణమని విమర్శించారు. యాపిల్ పండ్ల ట్రక్కులను నిలిపివేసి ఆపిల్ ఆర్థిక వ్యవస్థకు అంతరాయం కలిగించే జమ్మూకాశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా అమలు చేసే జాతీయ రహదారి దిగ్బంధన విధానాన్ని వెంటనే నిలిపివేయాలని కాశ్మీర్ లోయలోని యాపిల్ రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఏఎఫ్ఎఫ్ఐ (హిమాచల్ ప్రదేశ్) నేతలు సోహన్ సింగ్ ఠాకూర్, (జమ్మూకాశ్మీర్) అబ్దుల్ రషీద్ లేఖ రాశారు. యాపిల్‌కు లాభదాయక ధర ప్రకటించాలనీ, యాపిల్స్‌పై 100 శాతం దిగుమతి సుంకాన్ని విధించాలనీ, యూనివర్సల్ కార్టన్ తప్పనిసరి చేయాలనీ, రైతులకు చౌక ధరలకే ఎరువులు, పురుగు మందులు అందించాలని, యాపిల్ అనుబంధ అన్ని రకాల ఉత్పత్తుల నుంచి జీఎస్టీ తీసివేయాలని, పరీక్షించిన రకాల ఆపిల్లను మాత్రమే దిగుమతి చేసుకోవాలనీ, ప్రయివేటు దుకాణాలు నియంత్రణలోకి రావాలని ప్రధానికి రాసిన లేఖలో డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తప్పని సరిగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.