Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకేసారి 36 యూకే ఉపగ్రహాల ప్రయోగం
- ప్రపంచ అంతరిక్ష వాణిజ్య రంగంలోకి భారత్
సూళ్లూరుపేట : సాధారణంగా ఉదయం పూట సూర్యుడు ఉదయిస్తాడు. అయితే ఆదివారం వేకువజోమున ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. భారత కాలమానం ప్రకారము వేకువ జోమున 12 గంటల 7నిమిషాల 40 సెకండ్లకు మన తెలుగు నేల శ్రీహరికోట నుంచి అతి బరువైన ఉపగ్రహ వాహక ప్రయోగనౌక జిఎస్ఎల్వి మార్క్-3 అంతరిక్షానికి దూసుకెళ్లింది. షారులోని సెకండ్ లాంచ్ ప్యాడ్ నుంచి శాస్త్రవేత్తలు దీన్ని ప్రయోగించారు. సరిగ్గా 24 గంటల కౌంట్ డౌన్ నిర్విఘ్నంగా పూర్తి చేసుకుంది.ప్రపంచ వాణిజ్య తీరాలకు భారత్ విజయగర్వంతో మెరిసి పోయేలా ఈ రాకెట్ ప్రయాణం కొనసాగింది. భూమికి 601 కిలోమీటర్లలో ఎర్త్ఆర్బిట్ లో లండన్ కు చెందిన వన్ వెబ్ కంపెనీ వారి 36 కమ్యూనికేషన్ ఉపగ్రహాలను 20 నిమిషాల వ్యవధిలో ప్రవేశపెట్టింది. ఈ దృశ్యాలను హిందూ మహాసముద్రంలో మన శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న గ్రౌండ్ స్టేషనులకు సంకేతాలు అందాయి.అక్కడి నుంచి ఈ ప్రయోగాన్ని ఉత్కంఠగా వీక్షించిన ఇస్రో పెద్దలకు సమాచారం అందించారు. దీనితో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అమెరికా, రష్యా,చైనా దేశాలకు ఏమాత్రం తీసిపోని విధంగా సరికొత్త ఘటనలో మైలురాయిని చేరుకున్నది. ఇప్పటిదాకా కేవలం పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా మాత్రమే విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించిన ఇస్రో ఇక నుంచి అత్యంత బరువైన విదేశీ ఉపగ్రహాలను కూడా మన రాకెట్ల ద్వారా ప్రయోగించవచ్చని ప్రపంచానికి స్పష్టం చేసింది. దీంతో అంతరిక్ష ప్రయోగ కేంద్రాలు లేని ఎన్నో దేశాలు మన దేశ అంతరిక్ష విజ్ఞానానికి వాణిజ్య ఒప్పందాలు చేసుకునే అవకాశం ఏర్పడింది. బ్రిటన్ కు చెందిన వన్ వెబ్ కంపెనీ ఇప్పటికీ 13 ప్రయోగాలు వివిధ అంతరిక్ష పరిశోధన కేంద్రాల ద్వారా చేపట్టింది. ఈ 14వ ప్రయోగం కోసం మన రాకెట్ ను ఎంచుకుంది. శ్రీహరికోటలో గత కొన్ని రోజులుగా జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ద్వారా రాకెట్ నిర్మాణం కోసం, ఉపగ్రహాల అనుసంధానం కోసం శాస్త్రవేత్తలు నిర్విరామంగా పనిచేశారు. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ తో ఇస్రోకు ఒప్పందం కుదిరిన తర్వాత వన్ వెబ్ వంటి ప్రతిష్టాత్మక కంపెనీతో ఉపగ్రహాలను ప్రయోగించడానికి చురుగ్గా వ్యవహరించి ఒప్పందం కుదుర్చుకున్నారు. వన్ వెబ్ కంపెనీతో భారత్ కు చెందిన భారతి ఎంటర్ప్రైజెస్ సంస్థకు సంబంధం ఉంది. మన దేశ అవసరాలకు కూడా ఈ ఉపగ్రహాల కమ్యూనికేషన్ వ్యవస్థ ఉపయోగపడుతుందని నమ్ముతున్నారు. పైగా వచ్చే మూడు నెలల్లోనే ఇటువంటి మరో రాకెట్‌ను నిర్మించుకుని ఇదే రీతిలో కేయూ కేఏ బాండ్ల వ్యవస్థ కలిగిన మరో 36 ఉపగ్రహాలను మన శ్రీహరికోట నుంచి ప్రయోగించడానికి అప్పుడే ప్రయత్నాలు జోరందుకున్నాయి. ఈ ప్రయోగ విజయానికి ముందు ఇస్రో చైర్మన్,భారతి ఎంటర్ప్రైజెస్ చైర్మెన్, న్యూ స్పేస్ ఇండియా చైర్మెన్లు దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వీరంతా షార్ లోనే ఉండి రాకెట్ ప్రయోగాన్ని దగ్గరగా వీక్షించారు. ఇస్రో చైర్మెన్ ఎస్. సోమనాథ్ రెండు రోజులుగా శ్రీహరికోట లోనే ఉండి జీఎస్ఎల్వీ మార్క్-3, ఎల్ వీ ఎం -, ఏం-21 రాకెట్ ప్రయోగానికి ఏర్పాట్లు పర్యవేక్షించి ప్రయోగించారు. ఈ సందర్భంగా ప్రయోగ అనంతరం ఆయన మాట్లాడుతూ ఇకపై శ్రీహరికోట నుంచి జరిగేవన్నీ ప్రతిష్టాత్మక ప్రయోగాలే అని ఇస్రో వాణిజ్య ఒప్పందాలలో భాగంగా మరింత ముందుకు దూసుకుపోయే అవకాశం కలిగిందన్నారు. షార్ లోని మిషన్ కంట్రోల్ సెంటర్లో మన ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు ఈసా శాస్త్రవేత్తలు, ఎన్ఎస్ఐఎల్, వన్ వెబ్ కంపెనీ నిర్వహకులు రాకెట్ విజయాన్ని తిలకించారు.