Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : అసోంలో జరిగిన విద్యార్థి సంఘ ఎన్నికల్లో భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) విజయం సాధించింది. గౌహతి యూనివర్శిటీకి అనుబంధ కాలేజీల్లో జరిగి ఈ ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ వివిధ కాలేజీల్లో వివిధ స్థానాలను కైవసం చేసుకున్నది. గౌహతి యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న బర్నగర్ కాలేజీలో ఎస్ఎఫ్ఐ ఘన విజయం సాధించింది. స్టూడెంట్ యూనియన్ ఎన్నికల ఫలితాలను బార్నగర్ కళాశాల ఎన్నికల బోర్డు ప్రకటించింది. నాలుగు స్థానాల్లో ఎస్ఎఫ్ఐ అభ్యర్థులు విజయం సాధించారు. సంయుక్త ప్రధాన కార్యదర్శిగా హిమేష్ దాస్, మ్యాగజైన్ ఎడిటర్‌గా జష్‌పాల్ రారు, డిబేట్ ఎడిటర్‌గా లిసా కలిత, స్టూడెంట్ లాంజ్ సెక్రెటరీగా మీర్‌జుమ్లా ఇస్లాం విజయం సాధించారు. గౌహతి కాలేజీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ విజయం సాధించింది. డిబేట్ ఎడిటర్‌గా నేహా ప్రధాన్, సామాజిక సేవా కార్యదర్శిగా మహిమ శర్మ ఘన విజయం సాధించారు. అయితే ఎస్ఎఫ్ఐ అధ్యక్ష స్థానాన్ని కూడా కైవసం చేసుకున్నది. అయితే ఓటింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని పేర్కొంటూ అధికారులు అధ్యక్షుడిగా ఎస్ఎఫ్ఐ నేతను విజేతగా ప్రకటించడానికి నిరాకరించారు. ఏబీవీపీ ఆందోళన ఒత్తిడితో కళాశాల అధికారులు ఈ చర్యకు దిగారు. అధ్యక్ష ఫలితాన్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో అధ్యక్ష ఎన్నికల ఫలితాలను బుధవారం ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. గెలుపొందిన అభ్యర్థులందరికీ ఎస్ఎఫ్ఐ అసోం, త్రిపుర రాష్ట్ర కమిటీలు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపాయి.