Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లో దారుణం జరిగింది. రాష్ట్రంలోని మనేంద్రగఢ్-చిర్మిని-భరత్పూర్ జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక హెల్త్ సెంటర్లో ఈ నెల 21న ఒక నర్సుపై మైనర్‌తో సహా నలుగురు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. మహిళను తాళ్లతో కట్టివేసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డమే కాకుండా, ఈ దారుణాన్ని చిత్రీకరించారు. బాధితురాలని చంపుతామని కూడా బెదిరించారు. దారుణానికి పాల్పడ్డ నలుగురిలో ముగ్గుర్ని అరెస్టు చేసినట్టు ఆదివారం ఉదయం పోలీసులు తెలిపారు.