Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు సంబంధించి ఎలక్టోరల్ తయారీ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో నవంబరు 1 నుంచి ఆయా నియోజకవర్గాల పరిధిలో ఉద్యోగుల బదిలీలు, నియామకాలను నిలిపివేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్తో పాటు ఎన్నికలు జరిగే బీహార్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను ముఖ్యంగా పోలింగ్ కేంద్రం స్థాయి ఆఫీసర్ల బదిలీలు, నియామకాలు చేపట్టరాదని స్పష్టం చేశారు. ఒకవేళ బదిలీలు అనివార్యమైతే ఎన్నికల కమిషన్ అనుమతితోనే చేయాల్సి ఉంటుందని తెలిపారు.