Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చంపకుండా వదిలేసినందుకు జీవిత ఖైదును 20ఏండ్లకు తగ్గింపు
న్యూఢిల్లీ : అత్యంత హేయమైన నేరానికి పాల్పడ్డ దోషిపై మధ్యప్రదేశ్ హైకోర్టు జాలిపడింది. 4ఏండ్ల చిన్నారిపై జరిగిన లైంగికదాడి కేసులో నేరం నిరూపితమైనా, దోషికి జీవితఖైదును మార్చుతూ..శిక్షా కాలాన్ని తగ్గించింది. ఈ కేసులో న్యాయస్థానం ఇచ్చిన తీర్పు వివాదాస్పదమైంది. 2007లో ఇండోర్లో 4ఏండ్ల చిన్నారిపై పక్కింటి యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ కేసులో సెషన్స్ కోర్టు నిందితుడికి తొలుత జీవితఖైదు శిక్ష విధించింది. అప్పట్నుంచీ గత 15ఏండ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్నాను..శిక్షాకాలాన్ని తగ్గించాలని దోషి ఇటీవల హైకోర్టును ఆశ్రయిం చాడు. ''దోషి అత్యంత హేయమైన నేరానికి పాల్పడ్డాడు. ఇలాంటి కేసు లో దోషికి శిక్షా కాలాన్ని తగ్గించే అవకాశమే లేదు. కానీ ఆ 4ఏండ్ల చిన్నారిని చంపకుండా వదిలేసినందుకు..నేరస్థుడికి విధించిన జీవితఖైదును 20ఏండ్లకు తగ్గిస్తున్నా''మని ఇండోర్ బెంచ్ తీర్పు వెలువరించింది. జస్టిస్ సుబోధ్ అభ్యంకర్, జస్టిస్ సత్యేంద్ర కుమార్సింగ్లతో కూడిన ధర్మాసనం 18న తీర్పు ఇచ్చింది. అడిషనల్ సెషన్స్ జడ్జి విధించిన జీవిత ఖైదును హైకోర్టు తగ్గించటం ఇప్పుడు చర్చనీయాంశమైంది.