Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓ బాలికను అలా సంబోధించినందుకు యువకుడికి జైలు శిక్ష : బాంబే హైకోర్టు
న్యూఢిల్లీ: మహిళను 'ఐటెమ్' అని సంబోధిస్తూ అగౌరవపరచడం నేరమని బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ మేరకు 'క్యా ఐటెం కిదర్ జా రహీ హౌ (ఏంటి ఐటెమ్ ఎక్కడికి వెళ్తున్నావు)' 'ఓరు ఐటెమ్ వినిపిస్తోందా' అంటూ ఓ బాలికను సంబోధించిన యువకుడిని దోషిగా పేర్కొన్న హైకోర్టు ఏడాదన్న జైలు శిక్ష విధించింది. మహిళను ఐటెమ్ అని సంబోధిస్తూ అగౌరవపరచడం నేరంగా పరిగణించొచ్చని స్పష్టం చేసింది. 2015లో ముంబయిలోని శాకినాకాలో నివసించే 16 ఏండ్ల బాలిక పాఠశాల నుంచి వస్తుండగా అదే ప్రాంతంలోని అబ్రార్ ఖాన్ అనే యువకుడు ఐటెమ్ అని పిలుస్తూ తన జుట్టు పట్టుకొని లాగడంతో ఆమె 100కు ఫోన్ చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ముందస్తు బెయిలు కోసం నిందితుడు కోర్టును ఆశ్రయించారు. బాంబే హైకోర్టు ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌జె అన్సారీ ముందు నిందితుడి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. బాధితురాలు, పిటిషనర్ ఇద్దరూ స్నేహితులేనని తెలిపారు. బాలిక తల్లిదండ్రులకు అది ఇష్టం లేక కావాలనే తప్పుడు కేసు బనాయించారని పేర్కొన్నారు. బాధితురాలి వాంగ్మూలం ఆధారం చేసుకున్న కోర్టు... నిందితుడి ప్రవర్తన సరికాదని పేర్కొంది. ఐటెమ్ అనడం అగౌరవపరచడమేననీ, ఆమె నిరాడంబరతను ఉల్లంఘించినట్లేనని తెలిపింది. నిందితుడు నేరపూరితంగా వ్యవహరించినట్టు స్పష్టం చేసింది. ఉద్దేశపూర్వకంగా బాధితురాలి జుట్టు పట్టుకొని లాగడం, ఆమెను ఐటెమ అని పిలవడం కూడా.. నిందితుడి ఆగ్రహాన్ని రుజువు చేస్తోందని పేర్కొంది. ఐపీసీ సెక్షన్ 354, పోక్సో చట్టంలోని సెక్షన్ 12 కింద నిందితుడిని దోషిగా ఖరారు చేస్తూ ఏడాదిన్నర జైలు ఖరారు చేసింది. మహిళల రక్షణ నిమిత్తం ఈ తరహా నేరాలపై కఠినంగా వ్యవహరించాలనీ, రోడ్‌సైడ్ రోమియోలకు గుణపాఠం చెపాల్సిన అవసరం ఉందని ఇటీవల 28పేజీల తీర్పులో న్యాయమూర్తి పేర్కొన్నారు.