Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవంబర్లో ఎయిర్పోర్టు, గిరిజన యూనివర్సిటీ శంకుస్థాపన : మంత్రి బొత్స
విజయనగరం:మూడు రాజధానుల ఏర్పాటు కోసం రోడ్ మ్యాప్ తయారవుతోందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విజయనగరం కలెక్టరేట్లో మీడియాతో మంగళవారం ఆయన మాట్లాడుతూ మూడు రాజధానుల ఏర్పాటు తధ్యమని, విశాఖపట్నం పరిపాలనా రాజధాని అవుతుందని చెప్పారు. ఇప్పటివరకు ఫేక్ రైతులతో అమరావతి పాదయాత్ర జరిగిందని విమర్శించారు. 600 మందితో పాదయాత్ర చేయాలనుకున్నారని, పోలీసులు గుర్తింపు కార్డులు అడగడంతో అందులో 60 మంది కూడా రైతులు లేరని తేలిందని చెప్పారు. అందుకే యాత్రను వారంతట వారే ఆపేసుకున్నారని అన్నారు. విశాఖ రాజధాని ఉత్తరాంధ్రులంతా కోరుకుంటున్నారని, తమ ప్రభుత్వం కూడా అందుకు కట్టుబడి ఉందని తెలిపారు. విశాఖ రాజధాని కోసం రాజీనామా చేస్తానంటూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన ప్రకటనపై ఒక విలేకరి ప్రశ్నించగా, మంత్రి బొత్స 'నీది ఏ పేపర్' అంటూ ఫైర్ అయ్యారు.