Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ఎన్నికల సంఘానికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వినతి
న్యూఢిల్లీ: మునుగోడులో 14 వేల నకిలీ ఓట్లను తొలగించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ అధికారి ప్రతినిధి సంబిత్ పాత్ర కలిసి వినతి అందించారు. మునుగోడు ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ దుర్వినియోగానికి పాల్పడుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికార పార్టీ ఎన్నికల నియమావళిని ఉల్లఘిస్తుందని ఆరోపించారు. మునుగోడులో ఇప్పటికే 12 వేల నకిలీ ఓట్లను తొలగించారని, మరో 14 వేల ఓట్లను కూడా తొలగించాలని కోరారు. మునుగోడు ఎన్నికల్లో డబ్బులు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారని, ప్రభుత్వ వాహనాలను సహితం ఇష్టానుసారంగా వినియోగిస్తున్నారని ఆరోపించారు.