Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిశీలన పూర్తికి మరో మూడు నెలలు
- పార్లమెంటరీ స్థాయి సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్నచర్చలు
- పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో నివేదిక లేనట్లే
న్యూఢిల్లీ. మహిళల చట్టబద్ధమైన వివాహ వయస్సును 18 నుంచి 21 ఏండ్లకు పెంచే బిల్లుకు సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదిక రాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వచ్చే అవకాశం లేదు. ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలించడం, చర్చలు పూర్తి చేసేందుకు మరో మూడు నెలల పార్లమెంటరీ స్థాయి సంఘం పొడిగించింది. విద్య, మహిళలు, చిన్నారులు, యువత, క్రీడలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి మూడోసారి పొడిగింపు ఇచ్చారు. ఇప్పుడు కమిటీ తన నివేదికను సమర్పించడానికి జనవరి 23 వరకు సమయం ఉంది. బాల్య వివాహాల నిషేధం సవరణ బిల్లు-2021పై నివేదికను పరిశీలించి, అందజేయడం కోసం స్టాండింగ్ కమిటీకి రాజ్యసభ చైర్మెన్ జగ్దీప్ ధన్కర్ అక్టోబర్ 24 నుంచి మూడు నెలల పాటు కాల వ్యవధిని పొడిగించారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రెటేరియట్ బులెటిన్‌లో తెలిపింది. ఈ బిల్లు గతేడాది డిసెంబర్ 21 స్టాండింగ్ కమిటీకి పంపుతూ కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో తెలిపింది. దీనికి లోక్‌సభ ఆమోదం తెలిపింది. తాజాగా కాల వ్యవధి పొడిగింపుతో కమిటీ తన పనిని వేగవంతం చేసే, సెషన్ ముగిసే లోపు నివేదిక సమర్పించకపోతే వచ్చే నెలలో ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాల్లో బిల్లు రాకపోవచ్చు. అయితే వచ్చే బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగం, బడ్జెట్ ప్రవేశపెట్టడం, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, బడ్జెట్‌పై చర్చలతో మొదటి విడత బిజీ షెడ్యూల్ ఉంటుంది. కాబట్టీ ఈ బిల్లు వచ్చే ఏడాది మార్చిలో జరిగే రెండో విడత బడ్జెట్ సమావేశాల రెండో విడతలో రావచ్చు.