Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ ప్రభుత్వ విధానాలను ఐక్య ఉద్యమాలతో ప్రతిఘటించాలి
- కుమార్ సిరోల్కర్ సంతాప సభలో నేతలు
న్యూఢిల్లీ :ఆదివాసీలు, అణగారిన ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన కుమార్ సిరోల్కర్ చిరస్మరణీయులని వ్యవసాయ కార్మిక, రైతు, డీఎస్ఎంఎం నేతల అన్నారు. ఆదివాసి ఉద్యమ నిర్మాణంలోనూ, వ్యవసాయ కార్మిక ఉద్యమ నిర్మా ణంలోనూ మహారాష్ట్రలో క్రియాశీలక పాత్ర పోషిం చిన కుమార్ సిరోల్కర్ ఇటీవల కన్నుమూశారు. గురువారం నాడిక్కడ ఎఐఏడబ్ల్యూయూ కార్యాల యంలో కుమార్ సిరోల్కర్ సంతాప సభ జరిగింది. ఈ సందర్భంగా ఎఐఏడబ్ల్యూయూ జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఎ.విజయరాఘవన్, బి. వెంకట్, ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా, డీఎస్ఎంఎం నాయకురాలు సుభాషిణి అలీ మాట్లాడారు. అణగారిన ప్రజల హక్కులు, చట్టాల సాధన కోసం తన యావత్ జీవితం పోరాటాలు ఉద్యమాలతోనే గడిపిన కుమార్ సిరోల్కర్ భౌతికంగా మరణించినా, కష్టజీవుల హృదయాల్లో జీవించే ఉంటారని అన్నారు. సిరోల్కర్ పూనా యూనివర్సిటీలో ఐఐటీ ర్యాంకు హౌల్డర్ గా ఉన్నత విద్యను అభ్యసించి చదువు పూర్తయిన వెంటనే మహారాష్ట్ర వ్యవసాయ కార్మిక, ఆదివాసి ఉద్యమాన్ని నిర్మించడానికి మారుమూల గ్రామాలకు వెళ్లి కష్టజీవులను చైతన్యపరచారని తెలిపారు. సనాతన సాంప్రదాయాలు ఆచరించే కుటుంబం నుంచి వచ్చి, సమాజంలో అంటరాని వాళ్ళుగా, అట్టడుగునున్న ప్రజల కుటుంబాల్లో జీవించి వారి సమస్యలను, వారి జీవితాలను అధ్యయనం చేసి వాటి మార్పు కోసం జీవితాంతం పనిచేశారని అన్నారు. అత్యంత నిరాడంబర జీవితాన్ని గడిపిన ఆయన అవివాహితు డిగా ఆ పేద కుటుంబాల్లోనే ఉంటూ తింటూ అణ గారిన ప్రజల ఉద్యమాలకు నాయకత్వం వహిం చారని అటువంటి ప్రజా నాయకుడిని కోల్పోవడం ప్రజా ఉద్యమాలకు తీరనిలోటని వారన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆదివాసీ ప్రజలు అనేక పోరాటాలు, త్యాగాలతో సాధించుకున్నటు వంటి చట్టాలన్నిటిని రూపుమాపి రాజ్యాంగానికి వ్యతిరేకంగా కార్పొరేట్ అనుకూల చట్టాలు చేస్తున్న దని విమర్శించారు. అడవులు, గనులు, అటవీ సంపద అంతా దోపిడీదారులకు అప్పగిస్తోందని అన్నారు. స్వాతంత్ర అనంతరం కష్టజీవుల కోసం వామపక్షాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు చేసిన అనేక ప్రజా ఉద్యమాల ఫలితంగా ఆహార భద్రత, ప్రజా పంపిణీ, ఉపాధి హామీ, భూ సంస్కరణలు, కనీస వేతనాలు లైంగికదాడి నిరోధక చట్టాలు లాంటి అనేక చట్టాలు సాధించుకున్నామనీ, వాటన్నిటిని ఇప్పుడు బిజెపి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని దుయ్యబట్టారు. కేంద్రంలోని మోడీ బీజేపీ ప్రభుత్వం అండతో ఉత్తరాది రాష్ట్రాల్లో దళితులు, ఆదివాసీల మీద అమానుషమైన హత్యాకాండ సాగుతుందని, దీనికి వ్యతిరేకంగా పోరాడి అణగారిన ప్రజల విముక్తి కోసం కృషి చేయటమే సిరోల్కర్కు మనం అర్పించే నిజమైన నివాళి అని అన్నారు. ఈ సభలో బివి రాఘవులు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సునీత్ చోప్రా, విక్రమ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.