Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: బ్రిటన్ నూతన ప్రధానిగా ఎంపికైన రిషి సునాక్‌తో ప్రధాని మోడీ తొలిసారి ఫోన్లో మాట్లాడారు. బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినందుకు మరోసారి ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా భారత్, యూకే మధ్య సమతుల్యతో కూడిన సమగ్రమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని(ఎఫ్‌టీఏ) ఓ ముగింపు దశకు తీసుకురావాల్సిన ఆవశ్యకతపై కీలకంగా చర్చించినట్టు మోదీ తెలిపారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేశారు.''రిషి సునాక్‌తో మాట్లాడినందుకు సంతోషంగా ఉంది. బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినందుకు ఆయనకు అభినందనలు తెలిపాను. ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు మేం కలిసి పనిచేస్తాం. సమగ్రమైన, సమతుల్యతతో కూడిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా ఓ ముగింపు దశకు తీసుకురావాల్సిన ఆవశ్యకతపై పరస్పరం అంగీకరించుకున్నాం'' అని పేర్కొన్నారు.