Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా
న్యూఢిల్లీ: రాష్ట్రపతి జోక్యం చేసుకుని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ను రీకాల్ చేయా లని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా డిమాండ్ చేశారు. దేశంలో రాజ్యాం గం, ప్రజా స్వామ్యం ఉన్నాయన్న విషయాన్నికేరళ గవర్నర్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు. గురువారం నాడిక్కడ సీపీఐ ప్రధాన కార్యాలయం (అజరు భవన్)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయవాడలో జరిగిన సీపీఐ 24వ అఖిల భారత మహాసభ నిర్ణయాలను వెల్లడించారు. సీపీఐ జాతీయ కార్యదర్శులు అమర్ జిత్ కౌర్, బినరు విశ్వంతో కలిసి డి.రాజా మాట్లాడారు. ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వంతో గవర్నర్ గొడవపడుతున్నారని విమర్శించారు. బీజేపీ-ఆర్ ఎస్ఎస్ కూటమి లౌకికవాదానికి, ప్రజాస్వా మ్యానికి, రాజ్యాంగానికి పెను ముప్పు తెచ్చిపెడుతోందని, మోడీ పాలనలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని విమర్శించారు. దేశానికి నష్టం చేసేలా రూపాయి విలువ క్షీణించిందని, ప్రప ంచ ఆకలి సూచీలో కూడా దేశం అట్టడుగు స్థానానికి పడిపోయిందని దు య్యబట్టారు. నిరుద్యోగం రోజురోజుకూ పెరిగిపోతోందని, ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేసి ప్రయి వేట్ పరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారని విమ ర్శించారు. ప్రజలను రక్షించాలంటే 2024 ఎన్నికల్లో బీజేపీ-ఆర్ఎస్ఎస్ కూటమిని ఓడించాలని పిలుపు ఇచ్చారు. అందుకు వామపక్ష లౌకిక ప్రజా తంత్ర పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, సామాజిక ఉద్యమాలు ఏకం కావాలని అన్నారు. ఫాసిస్టు శక్తులపై పోరాటంలో కమ్యూనిస్టు ఉద్యమ ఐక్యత కీలక మని రాజా అన్నారు. మార్క్సిజం-లెనినిజాన్ని దేశానికి వర్తింప జేయడంతో వర్గ దోపిడీని అంతం చేయడానికి, కుల నిర్మూలనకు, పితృ స్వామ్యాన్ని అంతం చేయడానికి పార్టీ పోరాటాన్ని ఉధృతం చేస్తుందని కూడా ఆయన చె ప్పారు. 2025లో పార్టీ శతాబ్ది ఉత్సవాలు జరుపుకునే నాటికి సభ్యత్వం పది లక్షలకు చేరుకుంటుందని, కమ్యూనిస్టు ఉద్యమం సూత్ర ప్రాయంగా ఐక్యం గా ఉండాలనే వైఖరిని పార్టీ కాంగ్రెస్ పునరుద్ఘాటించిందని పేర్కొన్నారు.