Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళలోని త్రిసూర్‌లో డిసెంబర్ 13 నుంచి 16 వరకు
న్యూఢిల్లీ : రైతులు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటు న్నారని, మోడీ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఏఐకేఎస్ జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్ ధావలే, హన్నన్ మొల్లా విమర్శించారు. శుక్రవారం నాడిక్కడ ఏఐకేఎస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐకేఎస్ నేతలు హన్నన్ మొల్లా, అశోక్ దావలే, అమ్రారామ్, విజూ కృష్ణన్, పి.షణ్ముగం, పి. కృష్ణ ప్రసాద్‌లు ఏఐకేఎస్ 35వ అఖిల భారత మహాసభ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిసాన్ సభ నేతలు మాట్లాడుతూ పోరాటం, సంఘటితం, ప్రత్యామ్నాయం కోసం ముందుకు నినాదంతో 35వ మహా సభ డిసెంబర్ 13 నుంచి 16 వరకు కేరళలోని త్రిసూర్‌లో జరుగుతున్నాయని తెలిపారు. మహాసభ నిర్వహించే హాల్‌కు వరదరాజన్‌గా నామకరణం చేసినట్లు పేర్కొన్నారు. 1999 లో కోజికోడ్‌లో కేరళలోని త్రిసూర్‌లో మహాసభ జరిగిందని, మళ్లీ 23 ఏండ్ల తరువాత కేరళలో మహాసభ జరుగుతోంద ని తెలిపారు. ఈ మహా సభకు దేశవ్యాప్తంగా 1.37 కోట్ల సభ్యత్వానికి ప్రాతినిధ్యం వహించే, సుమారు 800 మంది హాజరవుతారని తెలిపారు. సంఘం నిర్మాణం నిర్ణయాలు, భవిష్యత్తు పోరాటాలను నిర్ణయిస్తారని పేర్కొన్నారు. 2017 అక్టోబర్‌లో హర్యానాలోని హిసార్‌లో జరిగిన 34వ మహా సభ జరిగిన ఐదేండ్ల తరువాత ఈ మహాసభ నిర్వహిస్తు న్నామని చెప్పారు. కేంద్రంలోని మోడీ నేతృత్వంలోని బీజేపీ పాలనలో మూడు కార్పొరేట్ అనుకూల వ్యవసాయ చట్టాల ను రద్దు చేయాలని రైతుల ఐక్య పోరాటం చరిత్రాత్మక విజయం తరువాత ఈ మహాసభ జరుగుతోందని అన్నారు. ఈ చారిత్రాత్మక పోరాటంలో ఏఐకేఎస్ కీలక పాత్ర పోషిం చిందని తెలిపారు. కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాన్ని ఈ మహాసభ మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. ఈ మహాసభలో కనీస మద్దతు ధర చట్టబద్ద హామీ, రైతు రుణమాఫీ, పెన్షన్ వంటి అనేక అంశాలపై చర్చిస్తామని తెలిపారు.
లోగో ప్రత్యేకతలు...
ఏఐకేఎస్ 35వ అఖిల భారత మహాసభకు లోగో తయారు చేయాలని కళాకారులు, డిజైనర్లను కోరింది. ఏఐకేఎస్ అభ్యర్థనకు స్పందించిన దేశంలోని వివిధ ప్రాంతాల నుండి 50కి పైగా విభిన్న లోగోలను పంపారు. అన్ని లోగోలను పరిశీలించిన తరువాత ఏఐకేఎస్ కేంద్ర నాయకత్వం కేరళలోని ఎర్నా కులంకు చెందిన యువ కళాకారుడు అశ్వత్ రూపొందించిన లోగోను ఎంపిక చేశారు. మహాసభలో ఆయనకు జ్ఞాపిక ప్రదానం చేస్తారు. లోగో రైతాంగ పోరాటాలను సూచిస్తుంది. స్ఫూర్తిదాయ కమైన కిసాన్ లాంగ్ మార్చ్, పోరాటాలలో మహిళల ప్రముఖ పాత్ర, ఎర్రటి సూర్యుడు కార్మిక, రైతు ప్రత్యామ్నా యానికి నాంది పలికే ఐక్య పోరాటాల సూచి స్తుంది. నయా ఉదారవాద విధానాలకు ప్రత్యామ్నాయం, కార్పొరేట్ దోపిడీని ప్రోత్సహం, విద్వేష రాజకీయాలకు ప్రత్యామ్నా యం, ప్రజాస్వామ్య హక్కులను కాపాడే ప్రత్యామ్నాయంతో కూడిన అన్ని లోగోలు మహాసభ ఆవరణంలో ప్రదర్శించ బడతాయి. ఈ మహాసభలో ప్రతి గ్రామంలో కిసాన్ సభ, కిసాన్ సభలో ప్రతి కిసాన్ అనే లక్ష్యంతో కార్మిక, కర్షక ప్రత్యామ్నాయం దిశగా ముందుకు సాగడానికి కార్యాచరణ రూపొందిస్తారు.
దొడ్డి కొమరయ్య గ్రామం నుంచి త్రిసూర్కి జాతా
మహాసభ జయప్రదం కోసం కొన్ని కార్యక్రమాలు ఏఐకేఎస్ పిలుపు ఇచ్చింది. నవంబర్ 15న బ్రిటిష్ సామ్రా జ్యవాదం, భూస్వామ్య అణచివేతదారులకు వ్యతిరేకంగా పోరాడిన దిగ్గజ పోరాట యోధుడు బిర్సా ముండా జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో (ప్లాగ్ డే) కిసాన్ జెండాను ఎగురవేయాలని పిలుపు ఇచ్చింది. కేరళలోని పున్నప్రా వాయలార్ నుంచి మహాసభ జెండా, కయ్యూరు నుంచి జెండా స్తంభం ఊరేగింపుగా వచ్చి డిసెంబర్ 12న త్రిసూర్‌కు చేరుకుంటుంది. కిసాన్ సభ కోశాధికారి పి.కృష్ణప్రసాద్ నేతత్వంలోని తెలంగాణలోని తెలంగాణ సాయుధ రైతుల పోరాట స్థలం, మొదటి అమరవీరుడు దొడ్డి కొమరయ్య గ్రామం జనగాం నుంచి ఒక టార్చ్‌లైట్ (కాగడ) జాతా, తమిళనాడులోని కీజ్వెన్మణి నుంచి ఏఐకేఎస్ సహాయ కార్యదర్శి విజూ కృష్ణన్ నేతృత్వంలోని మరో జాతా ప్రారంభం అవుతాయి. ఈ జాతాలు అగ్రకుల భూస్వామ్య భూస్వాములు, వారి గూండాలు 44 మంది వ్యవసాయ కార్మికులను ఊచకోత కోసిన ప్రదేశం సేలం వద్ద కలుస్తుంది. సేలం జైలు అమరవీరులకు నివాళులర్పిస్తాయి. (1950 ఫిబ్రవరి 11న కిసాన్ ఉద్యమ నాయకులతో సహా ఇరవై ఇద్దరు సహచరులు పోలీసు కాల్పుల్లో మరణించారు). డిసెంబరు 12 నాటికి వివిధ ప్రాంతాల్లో సభలు, సమావేశాలు ముగించుకొని త్రిసూర్‌లోని మహాసభ వేదిక కు జాతాలు చేరుకుంటాయి. డిసెంబర్ 16న రైతు భారీ ర్యాలీ, బహిరంగ సభతో మహాసభ ముగుస్తుంది. బహిరంగ సభలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పాల్గొన్నారు.