Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్యప్రదేశ్‌లో గిరిజనుల సమస్యలు పట్టని బీజేపీ సర్కార్
న్యూఢిల్లీ : గిరిజనులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ ఒకటి. ఇక్కడ పలు జిల్లాల్లో భూ యాజమాన్య హక్కులు పొందలేక గిరిజినులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎన్నికల సమయంలో ఎన్నో వాగ్దానాలు చేసిన బీజేపీ, ఇప్పుడు వారి సమస్యల పట్ల పూర్తి ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. సు కువాసా అనే గ్రామంలో 70 శాతానికిపైగా గిరిజనులే నివసిస్తున్నారు. విచిత్రం ఏంటంటే గిరిజనుల్లో ఒక్కరంటే ఒక్కరికి భూమి హక్కును కలిగిలేరు. గ్రామంలోని 95శాతం సాగు యోగ్యమైన భూములు ఆ ఊరి పెత్తందార్ల చేతిలో ఉన్నాయి. భిల్లులు, భిలాలు, గోండులు..ఎన్నో ఏండ్లుగా భూ హక్కుల కోసం పోరాడుతున్నారు. దగ్గర్లో ఉన్న ఇండోర్‌కు వెళ్లి కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నారు.