Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల సంఘానికి బీజేపీ నేతలు ఫిర్యాదు
న్యూఢిల్లీ : తెలంగాణ పోలీసులు నమోదు చేసిన నకిలీ ఎఫ్ఐఆర్లపై సీబీఐ దర్యాప్తు జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని బీజేపీ నేతలు కోరారు. ఈ మేరకు శుక్రవారం నాడిక్కడ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, ఎంపి, మీడియా హెడ్ అనిల్ బలూనీ, బీజేపీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు ఓం పాఠక్ వినతిపత్రం సమర్పించారు. ఎమ్మెల్యేల కొనుగోలు ఆడియో టేపులపై ఫిర్యాదు చేశారు. తమ పార్టీ పరువును దిగజార్చుందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటూ పేర్కొన్నారు. ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో తప్పుడు ఆరోపణలతో తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. అనంతరం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ మాట్లాడుతూ నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారంటూ బీజేపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తప్పుడు ఆరోపణలతో పసలేని అంశాలతో సృష్టించిన ఆడియో క్లిప్పులను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసి అధికార టీఆర్ఎస్ ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తోందని అన్నారు.
సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి .కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి
టీఆర్ఎస్ శాసన సభ్యుల కొనుగోలు ఆరోపణల విషయంలో పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్లో ఎటువంటి ఆధారాలు చూప లేదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే ల కొనుగోలు విషయంలో బీజేపీపై పసలేని ఆరోపణలు చేశా రని విమర్శించారు. గురువారం నాడిక్కడ నేషనల్ గ్యాలరీ ఫర్ మోడరన్ ఆర్ట్‌లో అక్బర్ సాహెబ్ గీసిన చిత్రాలను ప్రదర్శించారు. ఆ చిత్ర ప్రదర్శనను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ పోలీసులపై నమ్మకం ఉందని, కాని ప్రభుత్వంపై నమ్మకం లేదని అన్నారు. కెేసీఆర్ కనుసన్నలలో పోలీసులు పనిచేస్తున్నారని ఆరోపిం చారు. నంద కుమార్ తనతోపాటు చాలా రాజకీయ పార్టీలకు తెలుసు, కేసీఆర్ కుటుంబానికి కూడా తెలుసని అన్నారు. 84 కెమెరాలు కాదు, 84 వేల కెమెరాలు పెట్టి షూట్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాల్సిన అవసరం ఉందని, ఆ స్వామీజీ ఎవరో తమకు తెలియదని, వాళ్లు ఎందుకు వచ్చారో తెలియదని అన్నారు.